Bigg Boss Telugu OTT : బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్, స్ట్రీమింగ్ తేదీ, బజ్ యాంకర్, క్వారంటైన్ అన్ని క్లారిటీ
Bigg Boss Telugu OTT : తెలుగు ప్రేక్షకుల ముందుకు బిగ్ బాస్ ఓటీటీ ద్వారా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల చివర్లో ఈ షో ప్రారంభం కాబోతున్నది అంటూ ఇంతకు ముందే ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని టాక్ నడిచింది. కానీ తాజాగా నిర్వాహకుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎటువంటి విఘ్నాలు లేకుండా ఫిబ్రవరి చివరి వారంలోనే బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తోంది.ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. మరోవైపు రామోజీ ఫిలిం సిటీ లో బిగ్ బాస్ ఓటీటీ కోసం భారీగా ప్రోమో షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ షో కంటెస్టెంట్స్ విషయానికొస్తే ఎక్కువ శాతం మంది పాత కంటెస్టెంట్స్ ఉంటారని మొదటి నుంచీ చెబుతూ వస్తున్నాం. అన్నట్లుగానే మెజార్టీ కంటెస్టెంట్ పాత వాళ్ళే ఉండబోతున్నారు.
అందులో సీజన్ ఫోర్ నుండి అరియానా మరియు అఖిల్ ఇప్పటికే ఎంపిక చేశారని తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ బజ్ పేరుతో కొనసాగే టాక్ షో కు ఈ సారి యాంకర్ గా ఆర్ జే కాజల్ వ్యవహరించబోతుంది. గత సీజన్ కి అరియానా యాంకర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అంతకు ముందు రాహుల్ సిప్లిగంజ్ యాంకర్ గా వ్యవహరించారు. కరోనా ఇంకా కొనసాగుతున్న కారణంగా కంటెస్టెంట్స్ అందరూ కూడా కచ్చితంగా బూస్టర్ డోస్ తో సహా వ్యాక్సిన్ తీసుకుని ఉండడంతో పాటు వారం రోజులు ముందుగా క్వారంటైన్ లో ఉండాలని నిర్వాహకులు కండిషన్ పెట్టారు. అందులో భాగంగా ఫిబ్రవరి 15వ తారీఖున కంటెస్టెంట్స్ అందరిని క్వారెంటైన్ కి తరలించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఫిబ్రవరి 27వ తేదీ అంటే చివరి ఆదివారం హాట్ స్టార్ లో బిగ్ బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

Bigg Boss Telugu OTT Contestants Streaming Date Buzz Anchor Quarantine All Clarity
యూట్యూబ్ లో యాంకర్ గా ఫేమస్ అయిన శివను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా ట్రాన్స్ జెండర్ ని కూడా ఎంపిక చేశారని తెలుస్తోంది. టీవీ 5 మూర్తి బిగ్ బాస్ పై ఆసక్తిగా ఉన్నట్లు గా సమాచారం అందుతుంది. కనుక ఆయన్ను కూడా ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని మాకు విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. ఆయన బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చే విషయమై ఆసక్తి గా ఉన్నా ఈ సీజన్ లో ఆయన లేడని తెలుస్తోంది. గత సీజన్ ల కంటెస్టెంట్స్ విషయానికి వస్తే సింగర్ గీతామాధురి ఈ సీజన్లో ఉండబోతుందట. సీజన్ 1 నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ ఉంటారట. సీజన్ 5 నుండి కంటెస్టెంట్స్ ఉండకపోవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మరో రెండు వారాల్లో బిగ్ బాస్ ఓటీటీ హడావుడి మొదలు కాబోతుంది కనుక ప్రేక్షకులు మళ్లీ వినోదాల పంట ఖాయం.