Bigg Boss Telugu OTT : బిగ్‌ బాస్‌ నాన్ స్టాప్ కౌశల్‌ తర్వాత మళ్లీ ఆ రేంజ్ దక్కింది ఈమెకే

Advertisement

Bigg Boss Telugu OTT : తెలుగు బిగ్‌ బాస్‌ నాన్ స్టాప్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో అతి తక్కువ గానే ఈ షోను చూస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. షో లో ఏమాత్రం ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ లేరంటూ మొదట టాక్ వచ్చింది. కానీ షో సాగుతున్న కొద్దీ మెల్ల మెల్లగా కంటెస్టెంట్స్ ఆసక్తిగా మారుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ బిందు మాధవి అనూహ్యంగా టాప్‌ స్థానం దక్కించుకుంది. చాలా కాలంగా బిందు మాధవి తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఆమె ఒక తెలుగు అమ్మాయి అనే విషయం చాలా మందికి తెలియదు కానీ తెలుగు సినిమాల్లో చాలానే నటించింది.తెలుగులో హీరోయిన్ వరస సినిమాలతో ఆకట్టుకున్న ఈమె కోలీవుడ్‌ లో మంచి సక్సెస్ లను దక్కించుకుంది.

Advertisement

బిందు మాధవి తమిల బిగ్‌ బాస్ లో కూడా ఛాన్స్ దక్కించుకుంది. అక్కడి బిగ్ బాస్ లో సందడి చేసిన బిందు మాధవికి తెలుగు బిగ్‌ బాస్‌ వారు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ఆమె ఎంట్రీ ఇచ్చిన సమయంలో పెద్దగా గురించి చర్చ జరగలేదు. కానీ మొదటి వారం పూర్తయ్యే వరకు ఆమె గురించిన చర్చ సోషల్ మీడియాలో పీక్స్ కు చేరింది. ఆమె సందర్భానుసారంగా వ్యవహరించడం మాట్లాడడం కూల్‌ గా ఉండటం, టాస్క్ లో తెలివిగా ఆడడం.. ఇలా ప్రతి విషయంలో కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంది.బిందు మాధవి ఇప్పటికే హాట్ ఫేవరేట్ అయింది. అప్పుడే ఆమె ఈ సీజన్ విజేత అంటూ కొందరు ప్రకటన చేస్తున్నారు.

Advertisement
Bigg Boss Telugu OTT nonstop bindhu madhavi army started
Bigg Boss Telugu OTT nonstop bindhu madhavi army started

గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన కౌశల్ కి ఏ స్థాయిలో అయితే ఆదరణ దక్కిందో.. సోషల్ మీడియా లో కౌశల్ ఆర్మీ అంటూ ఏ స్థాయి లో హడావుడి జరిగిందో ఇప్పుడూ అదే స్థాయిలో బింధు మాధవికి ఆర్మీ ఏర్పడి హడావుడి జరుగుతుంది. ఈమె గెలుపు కోసం ఆ ఆర్మీ తీవ్రంగా కృషి చేస్తుందంటూ చెప్తున్నారు. కౌశల్ ఆర్మీ ఏ విధంగా అయితే ఇతర కంటెస్టెంట్స్ ను టార్గెట్ చేసిందో ఇక నుండి బిందు మాధవి ఆర్మ కూడా ఓ రేంజ్ లో ఇతర కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేయబోతుంది అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జోరు కొనసాగితే బిందు మాధవి తెలుగు బిగ్ బాస్ మొదటి మహిళా విజేత గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement