Bigg Boss Telugu OTT : బిగ్ బాస్ నాన్‌స్టాప్.. యాంకర్ శివ చిన్న పిల్లలాట ఆడుతున్నాడా?
తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ లో యాంకర్ శివ చిన్న పిల్లలు తరహాలో వ్యవహరిస్తున్నారంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతడు మెచ్యూరిటీ లేకుండా గేమ్ ఆడుతున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. అతుడు స్క్రీన్ ప్రజెన్స్ కోసం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ క్రమంలో అతడిని చేస్తున్న పనులు చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాయని, మెచ్యూరిటీ లేని వ్యక్తిగా అతడి వ్యవహారం ఉంది అంటూ ట్రోల్స్ వస్తున్నాయి.ఇప్పటికే హౌస్ లో ఉన్న వారు అతడి వ్యవహారం ను లైట్ తీసుకుంటూ.. అతడు అంతే అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం అతడిని తీవ్రంగా మందలించి, పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
జోకు పేరుతో బూతులు మాట్లాడటం అతనికి బాగా అలవాటు అయింది అని ప్రేక్షకులు మరియు ఇంటి సభ్యులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతడి వ్యవహారం ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే బయటకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు అంటూ టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే చాలా మందికి అతడంటే కోపంగా ఉంది, ఇలాంటి సమయంలో అతడు ప్రేక్షకులకు మంచి పేరు తెచ్చుకో కాకపోతే ఎలిమినేషన్ కి నామినేషన్ అయినప్పుడు కచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు మరియు బిగ్ బాస్ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

anchor shiva behaver in Bigg Boss Telugu OTT nonstop
యూట్యూబ్ యాంకర్ గా శివకు మంచి పేరుంది. టిక్ టాక్ స్టార్ ని ఇంటర్వ్యూ లు చేయడం ద్వారా పెద్దగా పాపులర్ అయ్యాడు. అతడి పాపులారిటీ తో ఏకంగా బిగ్బాస్ అవకాశం వచ్చింది. కానీ ఇంకా ఇంటర్వ్యూల్లో చిన్నపిల్లల చేసినట్లుగా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా చేయడంతో అతడిని ప్రేక్షకులు తిరస్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అతడు విమర్శలు ఎదుర్కొంటున్నా కానీ ముందు ముందు ఎలా ఉంటాడో చూడాలి అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.