Bigg Boss Telugu OTT : నేను నీ పెళ్ళాన్ని.. అరియాన నీ ముద్దుల మరదలు.. అజయ్ తో రెచ్చిపోయిన అషు రెడ్డి
Bigg Boss Telugu OTT : బిగ్‌బాస్.. ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోలో పార్టీస్‌పేట్ చేసే తమ ఫేవరేట్ కంటెస్టెంట్ల కోసం ఫ్యాన్స్ తెగ పరితపిస్తుంటారు. ఓటింగ్స్ అంటూ మిస్‌డ్ కాల్స్ అంటూ వీక్ ఎండింగ్‌లో హో.. అడావుడి చెసేస్తుంటారు. అయితే హౌస్ కంటెస్టెంట్స్ చేసే ఓవరాక్షన్ ని మాత్రం భరించలేం. షోలో ఒక్కో ఎపీసోడ్‌లో ఒక్కో గేమ్ ఆడుతూ ఫన్ పుట్టిస్తారు.. గొడవపడతారు.. కొట్టుకుంటారు. ఈ దరిద్రాన్ని చూస్తూ కొంత మంది ఎంజాయ్ చేస్తుంటారు కూడా..కాగా మంగళవారం అషురెడ్డి, అరియానా, అజయ్‌లు చేసిన రచ్చా అంతా ఇంత కాదు.
డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోయారు. ఒకరిపై మరొకరు తెగ పంచులేసుకున్నారు. వీళ్లు ముగ్గురు ఆడిన టాస్కలో బావ, మరదలు, వైఫ్ క్యారెక్టర్‌లతో ఫన్ పుట్టించారు. అఖిల్ కెమెరాలతో మాట్లాడుతూ తన గురించి తానే మాట్లాడుకుంటూ గొప్పలు చెప్పుకున్నాడు. అలాగే సరయూ ఏడుస్తూ ఎలిమినేషన్స్‌కి పోటీ అన్నట్లుగా కనిపించింది. అయితే షోలో భాగంగా ప్రశ్నలు అడుగగా వాటికి రాంగ్ ఆన్సర్ ఇస్తూ ఎండ్ బజర్ మోగేసరికి అధిక పాయింట్లతో లీడ్‌లో ఉన్న వాళ్లు విన్ అయినట్లు అనౌన్స్ చేస్తారు.ఈ టాస్క్‌లో భాగంగా అషురెడ్డి యాంకర్ శివని ఓడించింది.

Bigg Boss Telugu OTT Ashu Reddy comments on Ajay
Bigg Boss Telugu OTT : శివను ఆటాడుకున్న అషురెడ్డి..
ఆతర్వాత నటరాజ్ మాస్టర్‌ని ఆడుకున్నాడు. ఆతరువాత అజయ్ అడిగిన ప్రశ్నలకు అరియానా చాలా అతి చేసింది. సమాదానం ఇవ్వకుండా క్వచ్చన్ వేయడంతో పోటీ నుంచి తప్పుకుంది. అషురెడ్డి శివని ఓ ఆట ఆడుకుంది. అలాగే బిందు మాధవి సరయులా ప్రశ్నలు ఫన్ పుట్టించాయి. అలాగే పనిష్మెంట్ విషయంలో తేజస్వీని, చైతుల మధ్య గొడవ క్రీయేట్ అయింది. కాగా అషూరెడ్డి డబుల్ మీనింగ్ డైలాగ్స్, అటిట్యూడ్ ఎవరూ అడ్డుకోలేరు అన్నంతగా రెచ్చిపోయింది. అజయ్ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఎంటర్‌టైన్ చేశాడు. మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ రెచ్చిపోతున్నారు.