Prabhas : ప్రభాస్ కి అతిపెద్ద కష్టం .. మరొక వివాదంలో ఆదిపురుష్ !
Prabhas : డార్లింగ్ ప్రభాస్ నటించిన సినిమాలకు వరల్డ్ వైడ్‌గా మార్కెట్ ఉంది. బాహుబలి దెబ్బకు గత రికార్డులు అన్నింటిని ప్రభాస్ చెరిపేశాడు. ఇప్పుడు ప్రభాస్ రికార్డులను బద్దలు కొట్టడానికి బాలీవుడ్ హీరోలు, సౌత్ హీరోలంతా పోటీ పడుతున్నారని టాక్. అయితే, ప్రభాస్‌కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని పండితులు చెబుతున్నారు.దీంతో ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రభాస్ నటించిన చివరి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. అందులో ఒకటి సాహో, రాధేశ్యామ్ ఉన్నాయి. […]
Prabhas : డార్లింగ్ ప్రభాస్ నటించిన సినిమాలకు వరల్డ్ వైడ్‌గా మార్కెట్ ఉంది. బాహుబలి దెబ్బకు గత రికార్డులు అన్నింటిని ప్రభాస్ చెరిపేశాడు. ఇప్పుడు ప్రభాస్ రికార్డులను బద్దలు కొట్టడానికి బాలీవుడ్ హీరోలు, సౌత్ హీరోలంతా పోటీ పడుతున్నారని టాక్. అయితే, ప్రభాస్‌కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని పండితులు చెబుతున్నారు.దీంతో ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు.
ప్రభాస్ నటించిన చివరి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. అందులో ఒకటి సాహో, రాధేశ్యామ్ ఉన్నాయి. ఈ రెండు పాన్ ఇండియా మార్కెట్ సొంతం చేసుకున్నా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. తాజాగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం డైరెక్ట్ బాలీవడ్ చిత్రం.
దీనికి ఓం రౌత్ దర్శకత్వం వహించగా.. హీరో ప్రభాస్ రాముడి అవతారంలో కనిపించనున్నాడు. ఇక సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇప్పటికే రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించారు. బాలీవుడ్‌లో చెప్పిన టైంకే ప్రభాస్ ఆదిపురుష్ వస్తుండగా.. సౌత్‌లో మాత్రం కాస్త గందరోళ వాతావరణం నెలకొంది.ఎందుకంటే సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణతో పాటు పలు భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఆదిపురుష్ విడుదల చేస్తే తాము నష్టపోయే చాన్స్ ఉందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
Prabhas : ఈసారైనా ప్రభాస్ మెప్పిస్తాడా..
అందుకే ఈ సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పించాలని కోరుతున్నారట.. వీలైతే సంక్రాంతి ముందు లేదా తర్వాత విడుదల చేయాలని కోరనున్నారట. ఇక జనవరి 26కు బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ పఠాన్ రిలీజ్ కానుంది. చాలా కాలం తర్వాత షారుక్ మూవీ విడుదలకు సిద్ధమైంది. అందుకే ఆదిపురుష్ విడుదలపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తర్జనభర్జన పడుతున్నారు.గత రెండు సినిమాలు ప్లాప్ కావడంతో ఈసారైనా హిట్ కొట్టాలని అటు ప్రభాస్, ఇటు ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. మరి ఈ సమస్యను డార్లింగ్ ఎలా అధిగమిస్తాడో వేచిచూడాల్సిందే.