Yogi Babu : గుడిలో ప్రసాదం తిని బతికే యోగి బాబు టాప్ కమెడియన్‌గా ఎలా ఎదిగాడు?
Yogi Babu : యోగి బాబు పేరు అంటే టక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ.. ఆయన ముఖం చూస్తే మాత్రం వెంటనే గుర్తు పడతాం. ప్రస్తుతం కోలీవుడ్ లో యోగి బాబు టాప్ కమెడియన్. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే.. యోగి బాబు ఆ సినిమాలో ఉండాల్సిందే. టాలీవుడ్ లో బ్రహ్మానందం ఎలాగే.. తమిళంలో యోగి బాబు అలా అని చెప్పుకోవచ్చు. అసలు యోగి బాబు సినిమాల్లోకి ఎలా వచ్చారు అనేది చాలా మందికి తెలియదు. ఆయన బ్యాక్ గ్రౌండ్ కూడా చాలామందికి తెలియదు.యోగి బాబు చిన్నప్పటి నుంచే లావుగా ఉండేవారు. తండ్రి ఆర్మీలో పని చేసేవారు. అరుణాచలం దగ్గర్లోని అరణి అనే టౌన్ లో జన్మించాడు యోగి బాబు. యోగి అనే తమిళం సినిమాలో నటించడంతో ఆ సినిమా పేరే తన పేరు అయింది.
తన తండ్రి ఎప్పుడూ ఆర్మీలో చేరాలని చెప్పాడు. కానీ.. యోగి బాబుకు ఆర్మీలో వెళ్లడం ఇష్టం లేదు. డిగ్రీ చదువుతుండగానే ఒక రోజు తనకు ఏం చేయాలో తెలియక.. కొన్ని రోజుల తర్వాత జేబులో 200 రూపాయలు పెట్టుకొని యోగి బాబు చెన్నైకి నడుచుకుంటూ వెళ్లబోతూ మధ్యలో ఒక గుడి దగ్గర ఆగాడు. అక్కడే కొన్ని రోజులు ఉన్నాడు. గుడిలో పెట్టే ప్రసాదం తిని చాలా రోజులు ఉన్నాడు.అయితే.. ఒకరోజు ఆ గుడిలో ఓ సీరియల్ షూటింగ్ జరుగుతుండగా అక్కడ తనకు అవకాశం ఇవ్వాలని కోరాడు. కానీ.. ఎవ్వరూ పట్టించుకోలేదు. రెండు రోజుల తర్వాత డైరెక్టర్ తన ఆకారం చూసి ఒక క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ సీరియల్ సూపర్ హిట్ అవడంతో అందరి గురించి యోగి బాబుకు తెలిసింది. తన తల్లిదండ్రులు కూడా యోగి బాబు గురించి తెలుసుకొని అతడికి సినిమాలు అంటే ఆసక్తి అని తెలుసుకొని మద్రాసుకు పంపించారు. ఆ తర్వాత మద్రాసులో సినిమాల్లో అవకాశాల కోసం తిరగని ప్లేస్ లేదు. కానీ..
Yogi Babu : చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతో యోగి బాబుకు బ్రేక్
తనకు అనుకున్నంతగా అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత యోగి అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేసే అవకాశం దక్కింది యోగి బాబుకి. ఆ పాత్రకి కూడా యోగిబాబుకు మంచి పేరు వచ్చింది. దీంతో ఆ సినిమా పేరుతోనే తన పేరును పెట్టుకొని యోగి బాబు అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ వెళ్లాడు. విశాల్ హీరోగా వచ్చిన ఓ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ దక్కంది. ఆ తర్వాత చెన్నై ఎక్స్ ప్రెస్ లోనూ మంచి క్యారెక్టర్ రావడంతో ఇక తన కెరీర్ ఒక్కసారిగా ఎగబాకింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు టాప్ కమెడియన్ గా కోలీవుడ్ లో స్థిరపడిపోయాడు యోగి బాబు.