Bithiri Sathi : బితిరి సత్తి ఇంటర్వ్యూలు అప్పుడే బోర్‌ కొట్టాయా… సత్తి ఏం చేస్తున్నాడు ఇప్పుడు?

 Authored By prabhas | The Telugu News | Updated on :2 January 2023,11:40 am

Bithiri Sathi : వెండి తెర పై సందడి చేయాలని.. దర్శకత్వం చేయాలని చేవెళ్ల రవి ఎంతో ఉబలాట పడ్డాడు. దాదాపు పది సంవత్సరాల పాటు దర్శకత్వ ప్రయత్నాలు చేసిన చేవెళ్ల రవి చివరికి ఒక న్యూస్ ఛానల్ లో బిత్తిరి సత్తిగా ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ కార్యక్రమం సూపర్ హిట్ అవడంతో చేవెళ్ల రవి కాస్త బిత్తిరి సత్తిగా మారి పోయాడు. సుదీర్ఘ కాలం పాటు ఆ కార్యక్రమంలో సందడి చేసిన బిత్తిరి సత్తి కొన్ని కారణాల వల్ల ఆ ఛానల్ నుండి బయటకు వచ్చి మరో ఛానల్లో కనిపించాడు. మూడు నాలుగు చానల్స్ మారిన బిత్తిరి సత్తి యూట్యూబ్ ద్వారా సొంత వీడియోలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఒకానొక సమయంలో ఆయన కొత్త సినిమాల ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ వరుసగా చేశాడు. గత ఏడాది 20 నుండి 25 ఇంటర్వ్యూలు చేసిన బిత్తిరి సత్తి ఏడాది చివర్లో మాత్రం స్లోడౌన్ అయ్యాడు. ఆయన ఇంటర్వ్యూ చేస్తే సినిమాలు సక్సెస్ అవడం లేదని చాలా మంది భావిస్తున్నారట. అందుకే ఆయనతో ప్రమోషనల్ ఇంటర్వ్యూలకు సినీ ప్రముఖులు ఆసక్తి చూపించలేదు. మహేష్ బాబు, రవితేజ తో పాటు చాలా మంది కూడా ఇప్పటికే బిత్తిరి సత్తితో ఇంటర్వ్యూ చేయించి తమ సినిమాలను ప్రమోట్ చేసుకున్నారు. ఆయన ఇంటర్వ్యూ చేసిన సినిమాల్లో చాలా తక్కువ శాతం సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. అందుకే ఆయన ప్రమోషనల్ ఇంటర్వ్యూలకు దూరమయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది. కొందరు బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు బోర్ కొట్టడంతో ప్రేక్షకులు చూడడం

Bithiri Sathi not doing movie promotional interviews now

Bithiri Sathi not doing movie promotional interviews now

లేదని ఫీల్ అయ్యి ఆయన ఇంటర్వ్యూలను చేయించడం లేదు. ఈ సమయంలో బిత్తిరి సత్తి ఏం చేస్తున్నాడు అంటూ చాలా మందికి అనుమానాలు రావచ్చు. ఆయన యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ బిత్తిరి సత్తికి ఉన్న విషయం తెలిసిందే. ఆ ఛానల్ ద్వారా ఎంటర్టైన్మెంట్ వీడియోలను తన ప్రేక్షకులకు అందిస్తున్నాడు. పెద్ద ఎత్తున యూట్యూబ్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకోవడంతో యూట్యూబ్లో కూడా భారీ మొత్తంలో బిత్తిరి సత్తికి ఆదాయం వస్తుందని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ముందు ముందు దర్శకత్వం చేయాలని ఆశ పడుతున్నాడు. మరి ఆయన దర్శకుడిగా వరుస సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంటాడా లేదా అనేది చూడాలి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి