Adipurush Movie : ఆదిపురుష్ విడుదలకి ముందరే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ న్యూస్ !
Adipurush Movie : టాలీవుడ్ లో పాన్ ఇండియా ట్రెండ్ ను పరిచయం చేసిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. త్వరలోనే ప్రభాస్ ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ సినిమాపై ఇప్పటికి అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా రామాయణం ఇష్టపడే ప్రతి ఒక్కరు ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూడడానికి ఇష్టపడుతున్నారు. త్రీడీలో కూడా ఈ సినిమాలు విజువల్ ఫీస్ట్ గా తెరపై ఓం రౌత్ ఆవిష్కరించబోతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో ఘనంగా జరగబోతుంది. ఈవెంట్ జరిగే ప్రాంతం మొత్తం రామనామంతో ప్రతిధ్వనించే విధంగా సౌండ్ సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో ఇప్పుడు బాలీవుడ్లో రామాయణం సీరియల్ నటుడు లక్ష్మణుడి పాత్రలో నటించిన సునీల్ లహ్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిపురుష్ సినిమా చూడడం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే ఈ సినిమాలో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ట్రైలర్ లో అతని పాత్ర పెద్దగా ఎలివేట్ చేయలేదు. మరీ సినిమాలో ఏ స్థాయిలో లక్ష్మణుడి పాత్రకి ప్రాధాన్యత ఉందనేది చూడాలి. సన్నీ సింగ్ మంచి నటుడు. అతను కచ్చితంగా లక్ష్మణుడి పాత్రకు న్యాయం చేస్తాడని అనుకుంటున్నాను.
దర్శకుడు కథని ఎలా చూపించబోతున్నారు అనేదాన్ని బట్టి నటీనటుల పర్ఫామెన్స్ ఉంటుందని సునీల్ తెలిపారు. ఇక ఆదిపురుష్ లో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఆమెకి ఇది మొదటి పౌరాణికం. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఏది ఏమైనా ఆది పురుష్ సినిమాపై జనాలలో భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకోవడంలో దర్శకుడు ఏమాత్రం విఫలమైనా ఆరంభంలో టీజర్ రిలీజ్ తర్వాత జరిగినట్లే పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి కచ్చితంగా ఆది పురుష్ సినిమా ప్రేక్షకుల ఆలోచనకు తగ్గట్టుగానే తెరకెక్కించి ఉండాలి.