Home » Entertainment » Bollywood Heroin Priyanka Chopra Comments About Her Husband
Entertainment

Priyanka Chopra : ఇలాంటి రొమాంటిక్ మొగుడు దొరకడం నా అదృష్టం… ప్రముఖ స్టార్ హీరోయిన్ !!

Authored By
aruna
The Telugu News | Published on: August 14, 2023, 6:00 pm
Advertisement

Priyanka Chopra : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగులో రామ్ చరణ్ నటించిన ‘ తుఫాన్ ‘ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ బ్యూటీ కి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కానీ బాలీవుడ్లో, హాలీవుడ్ లో మాత్రం ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఇటీవల హాలీవుడ్లో సీటాడెల్ అనే వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయింది. ఆ సిరీస్ ని ఇప్పుడు బాలీవుడ్లో సమంత నటిస్తుందో. ఇక ఈ బ్యూటీ హాలీవుడ్ కి చెందిన ప్రముఖ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సరోగసి ద్వారా పిల్లలకు జన్మ కూడా ఇచ్చింది.

Advertisement

ఇక ప్రియాంక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. హాట్ ఫోటో షూట్లతో నిరంతరం వేడెక్కిస్తుంటుంది. తన భర్త నిక్ జోనస్ తో కలిసి ఆమె దిగే ఫోటోలు మామూలుగా ఉండవు. అయితే తాజాగా మరోసారి అలాంటి ఒక స్పెషల్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. న్యూయార్క్ లోని యాంకీ స్టేడియంలో జోనస్ బ్రదర్స్ కచేరీకి సిద్ధమవుతున్న వేళ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ కు చీర్ లీడర్ గా మారింది. ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తాజా ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటో షూట్ లో ప్రియాంక మూడ్ యూనిక్ లుక్ ఆకర్షించాయి.

Bollywood heroin Priyanka Chopra comments about her husband

Advertisement

ప్రియాంక నల్లని స్కర్ట్ లెదర్ జాకెట్ తో రేసి క్రాప్ టాప్ లో హాట్ గా కనిపించింది. ఇక నిక్ కచేరి కోసం పూర్తిగా తెల్లని దుస్తులను రెడీ అయ్యాడు. తన భర్తతో కలిసి ప్రియాంక హాట్ గా ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. మీరు ఒక అయస్కాంతం నిక్ జోనస్, నా భర్త అయినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని, అద్భుతమైన పర్యటన ప్రారంభమైనందుకు అభినందనలు, మీరంతా గొప్ప ప్రయాణంలో ఉన్నారు. లెట్స్ హూ, గ్రేట్ జాబ్ జెబీ బ్యాండ్ టీంకి శుభాకాంక్షలు అని వ్యాఖ్యానించింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి