Brahmamudi 21 Sep Today Episode : మూర్తిని కొట్టి విగ్రహాలన్నీ దొంగలించిన దుండగులు.. రుద్రాణి ప్లాన్ వర్కవుట్ అయిందా? కావ్య ఏం చేస్తుంది?
Brahmamudi 21 Sep Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 21 సెప్టెంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 207 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తాతయ్య గారు నన్ను ఆశీర్వదించండి. నేను మా పుట్టింటికి వెళ్తున్నా అంటుంది కావ్య. దీంతో పుట్టింటికి ఎందుకు.. ఇంట్లో పనులన్నీ అయిపోయాయా అంటుంది అపర్ణ. దీంతో అన్నీ పూర్తయ్యాయి అంటుంది. ఎందుకు ఆశీర్వాదం అని అడుగుతాడు తాతయ్య. దీంతో ఈరోజు నా కాంట్రాక్ట్ పూర్తవుతుంది. ఎలాంటి సమస్యలు లేకుండా కాంట్రాక్ట్ పూర్తయితే మా నాన్న చేసిన అప్పులన్నీ తీరుతాయి అంటుంది. దీంతో తాతయ్య, ఇందిరా దేవి ఇద్దరూ తనను ఆశీర్వదిస్తారు. రాజ్ ను తనను దించిరా అని చెబుతాడు. అత్తయ్య గారు నేను వెళ్లొస్తాను అని చెబుతుంది కావ్య. సరే అంటుంది. రుద్రాణికి మాత్రం ఏం చేయాలో అర్థం కాదు.
కట్ చేస్తే కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పు. మరోవైపు అనామిక కూడా వెయిట్ చేస్తుంటుంది. అనామిక కాల్ చేస్తుంది. కళ్యాణ్ కారులో వస్తుంటాడు. ఎక్కడ అబ్బాయి అంటే కారులో అంటాడు. అమ్మాయి పిలిస్తే గంట ముందు ఉంటారు అబ్బాయిలు. మరి మీరేమో కారులోనే ఉన్నారు అంటుంది అనామిక. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది అందుకే లేట్ అయింది అంటాడు కళ్యాణ్. మరోవైపు అప్పు కూడా కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు కళ్యాణ్. దీంతో అప్పుకు ఏం చేయాలో అర్థం కాదు. ఫాస్ట్ గా అనామికను కలవడానికి హోటల్ కు వెళ్తాడు. ఇంతలో వెడ్డింగ్ కార్డు చూపిస్తుంది అనామిక. దీంతో షాక్ అవుతాడు కళ్యాణ్. వెడ్డింగ్ కార్డు ఏంటి అని షాక్ అవుతాడు. దీంతో వెడ్డింగ్ కార్డు చూడండి.. అంటే ఇంకా చూసేదేముంది అంటాడు కళ్యాణ్.
Brahmamudi 21 Sep Today Episode : రాహుల్ కు ఫోన్ చేసి ఏం చేయాలో చెప్పిన రుద్రాణి
కార్డు తీసి చదవండి అంటుంది అనామిక. దీంతో అందులో పెళ్లి కొడుకు పేరు దుగ్గిరాల కళ్యాణ్ అని ఉంటుంది. ఆ పేరు చూసి షాక్ అవుతాడు కళ్యాణ్. నేను కవితలనే కాదు.. దాని వెనుక ఉన్న మనుషులను కూడా ప్రేమిస్తాను అంటుంది అనామిక. మరోవైపు వినాయకులు అన్నింటికీ రంగులు వేస్తుంటాడు మూర్తి. ఇంతలో కావ్య వస్తుంది. అందరూ కలిసి వినాయకుడికి రంగులు వేస్తుంటారు.
మరోవైపు రాహుల్ కు రుద్రాణి ఫోన్ చేస్తుంది. కావ్య పొగరు అనగాలి అంటుంది. ఈరోజు కావ్య కాంట్రాక్ట్ పూర్తి చేసి అప్పులు తీర్చాలని అంటుంది. అది చేసిన విగ్రహాలు అమ్ముడుపోకూడదు. కాంట్రాక్ట్ దూరం కావాలి. ఆ కుటుంబం రోడ్డు మీదికి రావాలి అంటుంది రుద్రాణి. దీంతో నువ్వు అన్నట్టే ఈ రోజు రాత్రికే ఆకావ్య విగ్రహాలన్నీ మాయం అవుతాయి అంటాడు రాహుల్.
మరోవైపు రాజ్.. తాతయ్యకు ఫోన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా? అని అడుగుతాడు రాజ్. దీంతో నువ్వు కావ్యకు ఫోన్ చేశావా అంటే.. నేను చేయలేదు అంటాడు. నాకు చేశావు కానీ.. తనకు ఎందుకు చేయలేదు అంటాడు. దీంతో సరే నేనే వెళ్లి తనను తీసుకొస్తాను అంటాడు రాజ్. దీంతో సరే అంటాడు తాతయ్య.
మరోవైపు రంగులన్నీ వేస్తుంటారు మూర్తి ఇంట్లో. కావ్య భోజనం చేయి అంటే నేను తర్వాత తింటా నాన్న అంటుంది కావ్య. ఇంతలో రాజ్ వస్తాడు. మరోవైపు రాత్రి కాగానే రాహుల్ పంపించిన మనుషులు వచ్చి మూర్తిని కొట్టి కింద పడేసి వినాయకుడి విగ్రహాలు అన్నీ తీసుకొని వ్యాన్ లో ఎక్కిస్తారు.
రాత్రి అక్కడే రక్తం మడుగులో పడి ఉంటాడు మూర్తి. తెల్లారి కావ్య, రాజ్, కనకం వచ్చి చూసేసరికి మూర్తి స్పృహ లేకుండా పడి ఉంటాడు. ఏమైందని అడగడంతో మనం కష్టపడి చేసిన విగ్రహాలన్నీ ఎత్తుకెళ్లిపోయారు అంటాడు మూర్తి. ఆ తర్వాత ఏ జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.