Breaking News : షూటింగ్ జరుగుతూ ఉండగా దర్శకుడి భార్య ఎంట్రీ ఇచ్చింది .. వెంటనే కొంపమునిగే బ్రేకింగ్ న్యూస్..!!
Breaking News : ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో దేశమంతటా ప్రేక్షకులని మెప్పించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమాలో డైరెక్టర్ వివేక్ భార్య, నటి పల్లవి జోషి కూడా ఓ ముఖ్య పాత్రలో నటించి అలరించింది. పల్లవి మరాఠి, గుజరాతి, హిందీ భాషల్లో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఈ నటి. ప్రస్తుతం డైరెక్టర్ వివేక్ ‘ది వ్యాక్సిన్ వార్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రంలో పల్లవి జోషి కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుండగా,
ప్రమాదానికి గురైంది పల్లవి. కార్ చేజింగ్ సీన్ షూట్ చేస్తుండగా వాహనం అదుపు తప్పడంతో పల్లవిజోషికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా కూడా పల్లవి తన షూట్ పూర్తి చేసి హాస్పిటల్ కి వెళ్లిందని తెలుస్తుంది.. ప్రస్తుతం ఆమెకి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కంగారు పడాల్సిందేమి లేదని, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పుకొచ్చారు. అభిమానులు, పలువురు నెటిజన్లు పల్లవి జోషి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. భర్త చేసే సినిమాల్లో నటించే పల్లవి జోషి.. తాజాగా ఆయన చేస్తున్న ది వ్యాక్సిన్ వార్ మూవీలోనూ నటిస్తుండడం విశేషం. పల్లవి జోషి..
Breaking News : ఇలా జరిగిందేంటి..!!
షూటింగ్ కు అంతరాయం కలగకుండా చూసుకునేందుకు గాయాలతోనే తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసి ఆసుపత్రికి వెళ్లిందని అంటున్నారు. వివేక్ అగ్నిహోత్రి విషయానికి వస్తే.. ఒక్క సినిమాతో యావత్ దేశస్తుల నోళ్లలో నానటమే కాదు.. ఆయన పేరు ఒక బ్రాండ్ గా కూడా మారింది. కశ్మీర్ ఫైల్స్ మూవీతో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటంతో పాటు.. ఇంతకాలం వినిపించే వాదనకు భిన్నంగా ధైర్యంగా జరిగిన సత్యాన్ని ప్రపంచానికి చెప్పేయటం ఆయన కోట్లాది మందికి దగ్గరయ్యాడు. మంచి మంచి సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉండే వివేక్ భార్యకి ఇలా జరగడం ప్రతి ఒక్కరిని బాధిస్తుంది.