Hyderabad : బ్రేకింగ్ న్యూస్ .. ఫోటో కొట్టు.. డబ్బు పట్టు.. హైదరాబాదులో నీటి వృధా పై Ghmc కొత్త యాప్..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 23 February 2026, 1:30 pm
  •  Hyderabad : బ్రేకింగ్ న్యూస్ .. ఫోటో కొట్టు.. డబ్బు పట్టు.. హైదరాబాదులో నీటి వృధా పై Ghmc కొత్త యాప్..!

Hyderabad : హైదరాబాద్ నగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు కొత్త చర్యలు ప్రారంభమవుతున్నాయి. నగరంలో ఎవరైనా మోటారు పంపులను అధికంగా వినియోగించి సంపులను పొంగిస్తే లేదా పైప్ లీకేజీలను పట్టించుకోకుండా నీటిని వృథా చేస్తే ఇకపై భారీ జరిమానాలు తప్పవు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల బోర్డు (HMWSSB) ప్రత్యేక చర్యలు చేపట్టింది. మార్చి మొదటి వారం నుంచి “పానీ యాప్”ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యాప్ ద్వారా నగర ప్రజలు తమ పరిసరాల్లో జరుగుతున్న నీటి వృథాను ఫొటో తీసి నేరుగా అప్‌లోడ్ చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు సాంకేతిక పద్ధతుల ద్వారా ముఖ్యంగా IP అడ్రస్ ఆధారంగా, సంబంధిత వ్యక్తులను గుర్తించి తక్షణమే జరిమానా విధించనున్నారు.

Breaking News .. Ghmc new app on water wastage in Hyderabad..!

Hyderabad : బ్రేకింగ్ న్యూస్ .. ఫోటో కొట్టు.. డబ్బు పట్టు.. హైదరాబాదులో నీటి వృధా పై Ghmc కొత్త యాప్..!

అధికారుల ప్రకారం నీటిని నిర్లక్ష్యంగా వృథా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో బాధ్యతాయుతమైన వినియోగంపై అవగాహన పెంచడమే లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో నీటి సంరక్షణ అత్యంత కీలకమని సూచిస్తున్నారు. ఇక ప్రత్యేకంగా నీటి వృథాను గుర్తించి యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన వారికి ప్రోత్సాహకంగా రూ.200 నగదు బహుమతిని అందజేయనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో నీటి వినియోగాన్ని నియంత్రించడం, వృథాను తగ్గించడం ద్వారా నగరంలో సరఫరాను సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ పరిసరాల్లో నీటి వృథాను వెంటనే నివేదించాలని నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని బోర్డు విజ్ఞప్తి చేసింది.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి