
Interesting news about Sreeleela
Sreeleela : పెళ్లి సందడి ‘ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల Sreeleela అది తక్కువ టైంలోనే పాపులర్ అయింది. ఇటీవలే మాస్ మహారాజా రవితేజ కు జోడిగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో శ్రీ లీల పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం శ్రీ లీల వరుసగా ఆరు, ఏడు సినిమాలను చేస్తుంది. అందులో ఒకటి నటసింహం బాలయ్య సినిమాలో కనిపించబోతుందట. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తుంది. ఈ సినిమాలో శ్రీ లీల బాలకృష్ణకు కూతురిగా కనిపించడం లేదట.
బాలయ్య Balakrishna బాబు స్నేహితుడు శరత్ కుమార్ కూతురిగా శ్రీ లీల ఈ సినిమాలో కనిపించనుందట. అయితే బాలకృష్ణ శ్రీలీల పట్ల అభిమానంతో స్నేహితుడి కూతురును తన కూతురిగా ప్రేమగా చూసుకుంటాడట. అయితే ఈ సినిమాలో ఓ ట్విస్ట్ ఉందని సమాచారం. బాలయ్య బాబు శ్రీలీల బంధానికి కథకు కీలకమైన లింకు ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కూడా నటిస్తుంది. ఇక బాలయ్య ఎన్నడూ లేని విధంగా ఫ్రెష్ అండ్ యంగ్ లుక్ లో కనిపిస్తాడు. అంతేకాదు ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసను మాట్లాడనున్నట్లుగా సమాచారం.
Sreeleela
ఈ సినిమాను హరీష్ పెద్ది సాహూ గారపాటి నిర్మిస్తున్నాడు. బాలకృష్ణ 108వ సినిమా కావడంతో ఎన్బికె 108 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ ఏడాది అక్టోబర్ 19 న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఎన్బికె 108 సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరీ ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్యను ఏ విధంగా చూపిస్తాడో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.