Bullet Bhaskar Father : వామ్మో బుల్లెట్ భాస్కర్ తండ్రి కూడా మొదలెట్టేశాడు.. లేడి గెటప్‌లో అప్పారావు లుక్

Authored By aruna | The Telugu News | Published on: September 5, 2022, 8:30 pm

Bullet Bhaskar Father : బుల్లెట్ భాస్కర్ బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. జబర్దస్త్ షో, శ్రీదేవీ డ్రామా కంపెనీలతో బాగానే బిజీగా ఉన్నాడు. ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ బుల్లెట్ భాస్కర్‌కు మంచి ఇమేజ్ ఉంది. అందరినీ బాగా గౌరవిస్తాడని, తన టీం సభ్యులకు అండగా ఉంటాడని అందరూ చెబుతుంటారు. అయితే బుల్లెట్ భాస్కర్ ఓ సారి ఫ్యామిలీ స్కిట్లో భాగంగా తన తండ్రిని స్టేజ్ మీదకు తీసుకొచ్చాడు. బుల్లెట్ భాస్కర్ తండ్రి అప్పారావు..

తన టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అలా అప్పటి నుంచి అప్పారావు జబర్దస్త్ స్టేజ్ మీద సందడి చేస్తున్నాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీలో సపరేట్ స్కిట్లు వేస్తున్నాడు. అయితే తాజాగా జబర్దస్త్ పైత్యాన్ని అట్టించుకున్నాడు. దాదాపు ప్రతీ ఒక్కరూ లేడీ గెటప్పులు వేస్తుంటారు. ఈ మధ్య లేడీ గెటప్పుల జోరు కాస్త తగ్గినట్టు అనిపిస్తోంది. అయితే లేడీ ఆర్టిస్టులు ఎంత మంది ఉన్నా కూడా అప్పుడప్పుడు లేడీ గెటప్పులే హైలెట్ అవుతుంటాయి. తాజాగా బుల్లెట్ భాస్కర్ తండ్రి కూడా లేడీ గెటప్ వేసుకున్నాడు.

Bullet Bhaskar Father Apparao Lady Getup In Extra Jabardasth

Bullet Bhaskar Father Apparao Lady Getup In Extra Jabardasth

దీంతో రష్మీ కౌంటర్లు వేసింది. మీరు కూడా ఇలా తయారయ్యారా? అంటూ సెటైర్లు వేస్తుంది. మొత్తానికి బుల్లెట్ భాస్కర్ తండ్రి తనకు ఇచ్చిన రోల్, గెటప్‌కు న్యాయం చేస్తూ స్కిట్లో అదరగొట్టేసినట్టు కనిపిస్తోంది. బుల్లెట్ భాస్కర్ మీద అప్పారావు వేసే కౌంటర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అమ్మకు ఈ మొహం ఎలా చూపిస్తావ్ నాన్నా అని భాస్కర్ అంటే.. ఎలా ఏంట్రా ఇలానే చూపిస్తాను అని కౌంటర్ వేయడంతో బుల్లెట్ భాస్కర్ తల కిందకు దించుకుంటాడు.

aruna

No bio available for this author.

  1. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  2. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  3. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  4. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  5. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  6. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  7. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp