Bullet Bhaskar : అప్పారావుని ఎప్పుడూ కించపర్చలేదు.. ఆయనకి మనకు తేడా లేదన్న బుల్లెట్ భాస్కర్
Bullet Bhaskar : బుల్లెట్ భాస్కర్ టీంలో ఎంతో మంచి వస్తుంటారు.. వెళ్తుంటారు. ఒకప్పుడు సునామీ సుధాకర్, అప్పారావు వంటి వారు సందడి చేశారు. కానీ ఇప్పుడు అందరూ వెళ్లిపోయారు. కొత్త టీం వచ్చింది. ఫైమా, వర్ష, ఇమాన్యుయేల్‌లతో నడిపిస్తున్నాడు. అయితే అలా సీనియర్లు వెళ్లడానికి కారణం మాత్రం బుల్లెట్ భాస్కర్ ధోరణియే కారణమని అంటుంటారు. వారితో కాస్త కఠువుగా ఉండేవాడని, యాటిట్యూడ్ ప్రదర్శించే వాడని, కించపరిచేవాడని కామెంట్లు వినిపిస్తుండేవి. అందుకే కో టీం లీడర్ అయినా కూడా అప్పారావ్ బయటకు వెళ్లాడనే టాక్ ఉంది. దీనిపై ఇంద్రజ తాజాగా ప్రశ్నలు సంధించింది. అప్పారావు పేరు ఎక్కడా కూడా ప్రస్థావించలేదు.
కానీ విషయం మాత్రం అతని గురించే అని స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తానికి బుల్లెట్ భాస్కర్ ఈ విషయం గురించి ఎక్కడా స్పందించకూడదని అనుకున్నాడట. మొదటి సారిగా చెబుతున్నానంటూ అసలు సంగతి చెప్పాడు. ఇక్కడ ఎవరు ఉండాలి.. ఎవరు ఉండకూడదని డిసైడ్ చేసేది నేను కాదు.. స్కిట్లో చాన్స్ కూడా నేనివ్వలేను.. స్క్రిప్ట్ ఎలా వస్తే.. దానికి తగ్గట్టుగానే పాత్రలు ఇస్తుంటాం.. నా టీంలో నాకే తక్కువ డైలాగ్స్ ఉంటాయి.. ఎందుకంటే నేను అంత పెద్ద పర్ఫార్మర్‌ని కాదు.. నేను స్కిట్‌ను ముందుకు తీసుకెళ్లగలను అంతే. అయినా నేను ఎప్పుడూ కూడా ఆయన్ను కించపర్చలేదు..
తక్కువ చేసి చూడలేదు.. వయసులో నాకంటే పెద్దవారు.. ఆయన ఒక వేళ అలా చెప్పినా కూడా అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.. ఆయన ఏదో అన్నారని, మనం కూడా అలా అనలేం.. అప్పుడు ఆయనకు మనకు తేడా ఉండదు అంటూ బుల్లెట్ భాస్కర్ వివరణ ఇచ్చుకున్నాడు. మొత్తానికి అప్పారావు మాత్రం హర్ట్ అయి జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడనేది నిజం అందుకే అప్పుడప్పుడు కామెడీ స్టార్స్ షోలో చేస్తున్నాడు అప్పారావు. ఇక సినిమాల్లోనూ అప్పారావు అడపాదడపా కారెక్టర్లను పోషిస్తున్నాడు. మొత్తానికి బుల్లితెరపై మాత్రం ఆయన ఎక్కువగా కనిపించడం లేదు.