Jabardasth Apparao : వెక్కి వెక్కి ఏడుస్తోన్న జబర్దస్త్ అప్పారావు .. అసలేమైందో తెలుసా..?
Jabardasth Apparao : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన నటులలో ఒకరు అప్పారావు. ఈ షో ద్వారా చాలామంది సెలబ్రిటీలుగా మారారు. ఫైనాన్షియల్ గా కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ షో మొదలై పదేళ్లు దాటుతున్న ఇంకా బుల్లితెరపై కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ షో ద్వారా ఎంతోమంది వెండితెరపై అవకాశాలు అందుకుంటున్నారు. ఇక అప్పారావు కూడా జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన వాడే. దీని ద్వారానే పలు సినిమాలలో కమెడియన్ కూడా నటించాడు. అయితే తాజాగా అప్పారావు సోషల్ మీడియాపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కి ఎలాంటి డిమాండ్ ఉన్న ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉన్నది లేనిది మొత్తం యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ వంటి వాటిల్లో పెడుతూ జనాలను ఇబ్బందికి గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలను బ్రతికుండగానే చనిపోయారని వార్తలు రాస్తున్నారు. డబ్బు కోసం బ్రతికున్న మనిషి చంపేస్తారా అని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాపై ఫైర్ అయ్యారు అయినా కానీ అవి ఆగడం లేదు. దీనిపై స్పందించిన అప్పారావు యూట్యూబర్స్ కి ఒకటి చెప్పాలి. దీని మీద నేనొకటి నాటిక కూడా రాద్దాం అనుకున్నాను. ప్రముఖులు బ్రతికుండగానే చనిపోయారని పోస్ట్ లు పెడుతున్నారు.
సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. అయితే బ్రతికున్న వ్యక్తులను చంపేసే హక్కు మీకు లేదు. అందరూ చనిపోతారు ఈ వార్తలు రాసే వాళ్ళు కూడా చనిపోతారు. లింక్ క్లిక్ చేయడం కోసం చనిపోయారని రాయడం క్షమించరాని నేరం అని, అవి మానసిక వేదనకు దారితీస్తాయని, పెద్దవారి తరుపున కూడా నేను కోరుకుంటున్నాను అన్నారు. మనకు తెలిసిందే ఈ మధ్య యూట్యూబ్లో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయారని పోస్ట్ క్రియేట్ చేశారు. నిజమే అని నమ్మిన పోలీసులు ప్రముఖుల భద్రత కోసం ఆయన నివాసానికి వెళ్లారు. పోలీసు వాహనానికి కోట శ్రీనివాసరావు ఎదురు రావడంతో వాళ్లు షాక్ అయ్యారు. ఇదేంటండి మీరు చనిపోయారని న్యూస్ వచ్చింది అని అన్నారు. ఈ విషయం పైనే అప్పారావు సోషల్ మీడియాపై కాస్త ఫైర్ అయినట్లు తెలుస్తుంది.