Bullet Bhaskar : యూట్యూబ్‌లో అలాంటి కామెంట్లు.. యాంకర్ మేఘన పరువుతీసిన బుల్లెట్ భాస్కర్
Bullet Bhaskar : బుల్లితెరపై ప్రసారం అవుతున్న రెచ్చిపోదాం బ్రదర్ షోలో యాంకర్‌గా చేస్తున్న మేఘన మంచి పాపులారిటీ సంపాదించుకుంది. గతంలో కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటించిన ఈ కథలో పాత్రలు కల్పితం చిత్రంలో మేఘన నటించింది. అయితే సినిమా చేసినప్పటికీ ఆమె సరైన గుర్తింపు దక్కలేదు. అయితే రెచ్చిపోదాం బ్రదర్ షో తర్వాత ఈ బ్యూటీ యాంకర్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. రెచ్చిపోదాం బ్రదర్ షో యూట్యూబ్ కామెంట్స్‌లో కూడా ఎక్కవగా ఆమె పేరే కనిపిస్తుంది.
ఇదే ఈ విషయాన్ని కమెడియన్ బుల్లెట్ భాస్కర్ తన స్కిట్‌లో భాగంగా ప్రస్తావించాడు. మేఘన గురించే కామెంట్స్ చేస్తున్నారని పరువుతీసేశాడు. స్కిట్‌లో భాగంగా.. అంతకు ముందు మేఘనను యాంకర్ అవమను అని కూడా భాస్కర్ కామెంట్ చేశాడు. ఆమె యాంకరింగ్ స్టైల్‌ను కూడా ఇమిటేట్ చేశాడు. దీంతో అక్కడున్నవారంతా నవ్వేశారు. అసలే ఇప్పుడు యాంకర్ మేఘన మంచి ఫాంలోకి వచ్చింది. యూట్యూబ్ ఆమె గురించే చర్చ నడుస్తోంది.
Bullet Bhaskar : మేఘనపై బుల్లెట్ భాస్కర్ కామెంట్లు..
అంతేకాకుండా యూట్యూబ్‌లో వచ్చే కామెంట్స్‌ను భాస్కర్ ప్రస్తావించారు. ఇంత కష్టపడి ఫర్ఫామెన్స్ చేస్తే మా పేర్లు ఉండవని భాస్కర్ అన్నాడు. కామెంట్స్ మొత్తంలో మేఘన పేరే కనిపిస్తుందని.. ‘మేఘన నీ డ్రెస్స్ బాగుందిరా.. మేఘన అందంగా ఉన్నావురా.. మేఘన అదిరా..’అంటూ ఉంటాయని చెప్పుకొచ్చాడు. దీంతో మేఘనకు ఏం చేయాలో అర్థం కాక.. చేతులను ముఖానికి అడ్డుగా పెట్టేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్‌గా మారింది.