Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

 Authored By ramu | The Telugu News | Updated on :7 August 2025,4:42 pm

ప్రధానాంశాలు:

  •  Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం నుంచి రాజా గాడికి సాంగ్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమాకు వేదికైన ఈటీవీ విన్ వారికి థ్యాంక్స్. అలాగే మా మూవీని థియేట్రికల్ రిలీజ్ కు వంశీ నందిపాటి, బన్నీ వాస్ గారు తీసుకొస్తుండటం హ్యాపీగా ఉంది. ఆదిత్య హాసన్ అన్న మరో మంచి మూవీ ప్రొడ్యూస్ చేశారు. మౌళి, నా ఫ్రెండ్, అతను హీరోగా నేను మ్యూజిక్ చేస్తానని అనుకోలేదు. శివానీ కూడా నాకు ఫ్రెండ్. మా అందరి కాంబోలో మూవీ రావడం సంతోషంగా ఉంది. అన్నారు.

Little Hearts Movie లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు బన్నీ వాస్

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : ప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా

హీరోయిన్ శివానీ నాగరం మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమాకు సపోర్ట్ చేసేందుకు వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. నేను అంబాజీ పేట మ్యారేజి బ్యాండు మూవీ తర్వాత ఏడాది పాటు మంచి సబ్జెక్ట్ కోసం వెయిట్ చేశారు. నేను వెయిట్ చేసిన మంచి జోష్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. ఈ సినిమాలో మౌళితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఆదిత్య హాసన్ గారికి “లిటిల్ హార్ట్స్” మరో మంచి సక్సెస్ ఫుల్ మూవీ అవుతుంది. మా మూవీని థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నందుకు వంశీ గారికి, బన్నీ వాస్ గారికి థ్యాంక్స్. ఈ పాటను మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.డైరెక్టర్ సాయి మార్తండ్ మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” కథను ఫస్ట్ మౌళి నమ్మాడు. మౌళి మీద నమ్మకంతో ఆదిత్య హాసన్ గారు నమ్మారు. అలా ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడిగా మారాను. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్ వారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా మూవీని వంశీ, బన్నీ వాస్ గారు థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. అన్నారు.

హీరో మౌళి తనూజ్ మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” చాలా ఎంటర్ టైనింగ్ గా ఎగ్జైటింగ్ గా ఉండే మూవీ. ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొస్తున్నందుకు వంశీ, బన్నీ వాస్ గారికి థ్యాంక్స్. వాళ్లు సినిమా తీసుకోవడమే కాదు మూవీలో ఏమేం నచ్చాయో మమ్మల్ని పిలిచి మరీ చెప్పారు. అంత ప్యాషన్ ఉంది కాబట్టే సక్సెస్ ఫుల్ మూవీస్ చేయగలుగుతున్నారు అనిపించింది. ఈటీవీ విన్ నుంచి సాయి కృష్ణ, నితిన్ గారు చాలా సపోర్ట్ చేశారు. మా ఆదిత్య హాసన్ కు ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. ఈ మూవీ కోసం సాయి మార్తండ్ తో పాటు మేమంతా ఎగ్జైటింగ్ కంటెంట్ తీసుకురావాలని బాగా ప్రయత్నించాం. శివానీ తో కలిసి నటించడం వల్ల నా కాన్ఫిడెంట్ పెరిగింది. నా ఫ్రెండ్ సింజిత్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రాజా గాడికి సాంగ్ మీకు బాగా నచ్చుతుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ మాట్లాడుతూ – ఈ వేదిక మీద అందరినీ చూస్తుంటే “90s మిడిల్ క్లాస్ బయోపిక్” గుర్తుస్తోంది. దాదాపు ఆ సిరీస్ కు పనిచేసిన వాళ్లే “లిటిల్ హార్ట్స్” టీమ్ లోనూ ఉన్నారు. ఇలాంటి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్న మౌళి తనూజ్ ను అప్రిషియేట్ చేయాలి. ఈ మూవీ మేకింగ్ టైమ్ లో చూస్తే మా “90s మిడిల్ క్లాస్ బయోపిక్”లాగే అనిపించింది. నేను ఏదైనా చెప్పాలనుకున్నా వద్దనుకునేంత బాగా మా డైరెక్టర్ సాయి మార్తండ్ స్క్రిప్ట్ రాశాడు. తను ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేయడంలో మంచి పేరు తెచ్చుకుంటాడని చెప్పగలను. ఫుటేజ్ చూస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ గా చాలా సంతృప్తి పడ్డాను. నేనొక దర్శకుడిగా చేసే సినిమా కంటెంట్ కూడా నా ప్రొడ్యూసర్ ను అలా సంతృప్తి పరచాలని అనిపించింది. ఈ చిత్ర ట్యాగ్ లైన్ లాగే హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ దాకా మీరు కథతో రిలేట్ అవుతారు. 2 గంటలు ఫుల్ ఎంటర్ టైన్ అవుతారు. ఈ సినిమా ప్రివ్యూను వంశీ గారు, బన్నీ వాస్ గారు చూస్తున్నప్పుడు ఏం రెస్పాన్స్ ఇస్తారో అని భయపడ్డా కానీ వాళ్లు సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నారు. వాళ్లిద్దరికీ ఈ మూవీ థియేట్రికల్ గా పెద్ద సక్సెస్ అందిస్తుందని నమ్ముతున్నా. “లిటిల్ హార్ట్స్” సినిమా కోసం వర్క్ చేసిన మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ – 2023 ఆగస్టు 7 మా “90s మిడిల్ క్లాస్ బయోపిక్” స్టార్ట్ చేశాం. ఆ సిరీస్ మాకు ఎంత పేరు తెచ్చిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ అదే రోజున “లిటిల్ హార్ట్స్” సాంగ్ లాంఛ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ మూవీని థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్న వంశీ, బన్నీవాస్ గారికి థ్యాంక్స్. మీరు టికెట్ కోసం పెట్టే ప్రతి రూపాయికి విలువైన వినోదాన్ని ఇచ్చే చిత్రమిది. ఈటీవీ విన్ లో మా మూవీస్ ఎలా ఆదరించారో థియేటర్స్ లోనూ అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమాను మేము చూస్తున్నప్పుడు ఇది థియేట్రికల్ కంటెంట్ , థియేటర్స్ లో బ్లాస్ట్ అవుతుంది అనిపించింది. బన్నీ వాస్ గారు తన బ్యానర్ నుంచి తీసుకొస్తున్న ఫస్ట్ మూవీ ఇది. యంగ్ టీమ్ ఈ చిత్రానికి పనిచేశారు. వాళ్ల ఎనర్జీ అంతా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందని నమ్ముతున్నాం. ఈటీవీ విన్ వారు తీసుకొస్తున్న కంటెంట్ చాలా బాగుంటుంది. మన చిన్నప్పటి మొమెరీస్ గుర్తు చేసేలా వాళ్ల మూవీస్, సిరీస్ లు ఉంటాయి. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” స్కూల్ జ్ఞాపకాలను, ఎయిర్ అనే సిరీస్ తో కాలేజ్ డేస్ ను గుర్తుచేశారు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ తో కాలేజ్ అయ్యాక ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన అబ్బాయి తన లవ్ సక్సెస్ చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ సినిమా ఆదిత్య హాసన్ కు మంచి పేరు తేవాలి. థియేట్రికల్ రిలీజ్ పరంగా బెస్ట్ ఇచ్చేందుకు మేము ప్రయత్నిస్తాం. అన్నారు.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమాను మేము రిలీజ్ చేస్తే బాగుంటుంది అని మా దగ్గరకు వచ్చిన సాయి మార్తండ్, ఆదిత్యకు థ్యాంక్స్ చెబుతున్నా. వాళ్లు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ప్రేక్షకుల్ని బాగా నవ్వించే మూవీస్ చేయాలని నేను కోరుకుంటాను. అలా ఈ సినిమా చూస్తున్నంత సేపూ నేనూ బాగా ఎంజాయ్ చేశాను. సెప్టెంబర్ 12న థియేటర్స్ లో ఈ సినిమా చూసే ప్రేక్షకులు సీట్ల మీద నుంచి కింద పడేలా నవ్వుకుంటారు. నేను వంశీ కలిసి నాలుగు చిత్రాలు చేశాం. నాలుగూ సక్సెస్ అయ్యాయి. “లిటిల్ హార్ట్స్” తోనూ మా జడ్జిమెంట్ ప్రూవ్ అవుతుందని నమ్ముతున్నా. ఈ సినిమాను దర్శకుడు సాయి మార్తండ్ ఎంతో సహజంగా తెరకెక్కించాడు. మన కాలేజ్ డేస్ లోని ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి. ఎక్కడా డ్రామా క్రియేట్ చేయకుండా హీరో క్యారెక్టర్ తో ఎంత మాట్లాడించాలో, ఎలా మాడ్లాడించాలో అంతే చెప్పించాడు. కొత్త దర్శకుడిగా ఇంత బాగా మూవీ చేయడం అభినందనీయం. మౌళి నాచురల్ యాక్టర్. అతడిని చూస్తే మనం బయట చూసే కాలేజ్ అబ్బాయిలాగే ఉంటాడు. అలాగే పర్ ఫార్మ్ చేస్తాడు. శివానీ బాగా నటించింది. ఈ సినిమాను కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఫ్రీ షోస్ వేయాలనుకుంటున్నాం. సోషల్ మీడియా వాళ్లకైతే కావాల్సినంత స్టఫ్ ఈ మూవీ ద్వారా దొరుకుతుంది. సింజిత్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. థియేటర్స్ లో “లిటిల్ హార్ట్స్” చూస్తూ పొట్టలు పగిలేలా నవ్వుకుంటారని చెప్పగలను. అన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది