Viral Video : పిల్లి మామను ఓ ఆటాడుకున్న బుజ్జి ఉడత.. వీడియో వైరల్
Viral Video: కొందరికి పెట్స్ చాలా ఇష్టం. అవి అప్పుడప్పుడు ఇంట్లో చేసే అల్లరి చూస్తే ఒక్కోసారి విసుగువస్తుంది. ఒక్కోసారి చాలా నవ్వు తెప్పిస్తుంది. అవి చేసే పనుల వలన యాజమానులకు పని పెరిగినా.. వాళ్లు ఆ అల్లరిని భరిస్తారు. ఎందుకంటే పెట్స్ అంటే వారికి ఉండే అమితమైన ప్రేమ కారణం అయి ఉండవచ్చు. సాధారణంగా మనం ఇళ్లల్లో పెంచుకునే కుక్కలు, పిల్లులను చూసే ఉంటాం. ఒకదానికి ఇంకొకదానికి అసలే పడదు. ఎప్పుడూ కొట్టకుంటూనే ఉంటాయి. అదే విధంగా ఎలుకను కనిపిస్తే పిల్లి దానిని తరమకుండా ఉండదు.

cat video viral in social media
ఇంట్లో పాలు పోసి పెంచుకునే జంతువులు బయట యానిమల్స్ లాగా వైల్డ్‌గా ఉండవు. ఇతర జంతువుల ప్రాణాలు తీయవు. కానీ ఒకదానికి ఒకటి కనిపిస్తే కొట్టుకుంటుంటాయి. చూసే వారికి అవి గొడవపడినట్టు కనిపించినా వాటి మధ్య మాత్రం స్నేహపూర్వక వాతావరణమే ఉంటుందని చాలా మందికి తెలీదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. సీసీటీవీ ఇడియట్స్ పేరుతో ట్విట్టర్ పోస్టు అయిన వీడియో చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ ఉడతను చూసి పిల్లి వెంటనే పరుగెత్తుకొస్తుంది. దానిని పట్టుకుందామని ప్రయత్నిస్తుంది. కానీ, ఆ బుజ్జి ఉడత తెలివిగా పిల్లి వీపుపైకి ఎగిరి జంప్ చేస్తుంది. అక్కడే కూర్చుని పిల్లిని ముప్పుతిప్పలు పెట్టిస్తుంది. అక్కడి నుంచి కదలకుండా ఉండా పిల్లిని ఓ ఆటాడుకుంటుంది.
Viral Video : వీడియో చూసి ఎంజాయ్ చేస్తున్న నెటిజన్లు..

cat video viral in social media
అయితే, ఉడత ఎక్కడపోయిందో అనుకుని పిల్లి అటు ఇటూ తెగ వెతుకుతుంది. కానీ దానివీపు పైనే ఉన్నదని గుర్తించలేకపోతుంది. ఈ ఫన్నీ విజువల్స్ చూస్తే మనకు ఒక విషయం అర్థం అవుతుంది. ప్రకృతిలో జంతువుల మధ్య వైరాలు ఉండవు.. స్నేహం మాత్రమే ఉంటుందని చెప్పడానికి ఈ వీడియో ఒక నిదర్శనం. అయితే, ఉడత తన తెలివితో పిల్లిని పిచ్చిదాన్ని చేయడం, ఆటపట్టించడాన్ని చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తూనే షేర్స్ చేస్తున్నారు.
Keep your enemies close ????pic.twitter.com/a5mlO5YVuU
— CCTV_IDIOTS (@cctv_idiots) October 22, 2021