Anasuya : అనసూయ పరువుతీసేశాడు.. చలాకి చంటి సెటైర్లకు అంతా ఫిదా
Anasuya : యాంకర్ అనసూయ అందం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అనసూయ పొట్టి బట్టలు ధరిస్తే చర్చే.. నిండైన వస్త్రాల్లో అందంగా కనిపించినా చర్చే.. మొన్నటికి మొన్న షేర్ చేసిన ఫోటో షూట్లు కాస్త తేడా కొట్టడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసి పడేశారు. ముసల్దానిలా అవుతున్నావ్ అంటూ.. ఓల్డ్‌గా కనిపిస్తున్నావ్ అంటూ నెటిజన్లు కామెంట్లతో నానా హంగామా చేశారు. అలా అనసూయ అందం మీద ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అలా అనసూయ అందం మీద జబర్దస్త్ షోలో ప్రశంసలు, సెటైర్లు రెండూ పడుతుంటాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ చలాకి చంటి అనసూయ అందం గురించి సెటైర్ వేశాడు.
తానేదో మూలికలు ఇస్తుంటాడట. అలా అనసూయ తన వద్దకు వచ్చి.. రోజురోజుకీ అందం పెరుగుతోంది అంటూ ఓ మూలిక అడిగిందట. దాంతో అనసూయ తెగ మురిసిపోతుంది. కానీ అంతలోనే చంటి ఓ సెటైర్ వేస్తాడు. ఆమెకు ఓ మూలిక ఇచ్చాను.. దీంతో ఆమె అందం రోజురోజుకీ పెరుగుతోంది అనే భ్రమ తగ్గిపోయిందంటూ పరువుతీసేశాడు. ఇక ఆ పంచ్‌తో అనసూయ మొహం మాడిదపోయినట్టుంది. కానీ అనసూయ మాత్రం తన అందాన్ని మెయింటైన్ చేసేందుకు చాలానే కష్టపడుతోంది. వర్కవుట్లు, యోగాలు అంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఆదివారం నాడు కూడా అనసూయ జిమ్‌కు రెస్ట్ ఇవ్వదు. ప్రతీ రోజూ వర్కవుట్లు చేస్తుంటుంది.

Chalaki Chanti Satires on Anasuya in Jabardasth
తన భర్తతో కలిసి అనసూయ జిమ్‌లో సందడి చేస్తుంటుంది. అలా అనసూయ తన ఫిజిక్‌ను కాపాడుకునేందుకు బాగానే ప్రయత్నిస్తుంటుంది. ఇక ఎప్పటికప్పుడు తన లుక్‌ను మార్చుకుంటుంటుంది. అనసూయ ప్రస్తుతం ఫుల్ బిజీగా మారుతోంది. అనసూయ చివరగా ఖిలాడీ సినిమాలో కనిపించింది. అందులో రెండు గెటప్పులో కనిపించి మెప్పించింది. ఇక దర్జా సినిమాతో మరోసారి లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో అనసూయ కనిపించబోతోంది. కోలీవుడ్, మాలీవుడ్‌లోనూ అనసూయ ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2కోసం అనసూయ రెడీగా ఉంది.
