Sridevi Drama Company : రోహిణి, బబ్లూలు ఏడిపించారు కదయ్యా.. ప్రోమో చూసి నెటిజన్ల కన్నీరు
Sridevi Drama Company : మల్లెమాల టీంకు ప్రతీ పండుగను ఎలా క్యాష్ చేసుకోవాలో బాగా తెలుసు. ఎవరి ఎమోషన్స్‌ను ఎప్పుడు చూపించాలి.. ఏ టైంకి చూపించాలి.. ఏ సందర్భంలో వాడుకోవాలి అన్నది బాగా తెలుసు. ప్రతీ పండుగకు తగ్గ థీమ్, సెటప్‌ను రెడీ చేసుకుని ఉంటారు. ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ రాబోతోంది. దీనికి తగ్గట్టుగా అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌ను తట్టి లేపే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు ఈ క్రమంలో వదిలిన ప్రోమో అందరినీ ఎమోషనల్‌గా టచ్ […]
Sridevi Drama Company : మల్లెమాల టీంకు ప్రతీ పండుగను ఎలా క్యాష్ చేసుకోవాలో బాగా తెలుసు. ఎవరి ఎమోషన్స్‌ను ఎప్పుడు చూపించాలి.. ఏ టైంకి చూపించాలి.. ఏ సందర్భంలో వాడుకోవాలి అన్నది బాగా తెలుసు. ప్రతీ పండుగకు తగ్గ థీమ్, సెటప్‌ను రెడీ చేసుకుని ఉంటారు. ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ రాబోతోంది. దీనికి తగ్గట్టుగా అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌ను తట్టి లేపే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు ఈ క్రమంలో వదిలిన ప్రోమో అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేస్తోంది.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రోహిణి, షబినా, కమెడియన్ బబ్లూలు ఏడిపించారు. రోహిణి తన కాలికి ఆపరేషన్ జరిగిన టైం గురించి చెప్పి ఏడ్పించింది. తన అన్న తనతో మాట్లాడటం లేదని చెప్పి కన్నీరు పెట్టేసింది. గత ఏడాది రాఖీకి తన చెల్లితో వచ్చానని, ఇప్పుడు ఒంటరిగా వచ్చానని కమెడియన్ బబ్లూ చెప్పాడు. తన చెల్లి మరణించిందని, బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయిందని, చనిపోయిందని చెప్పి కన్నీరు పెట్టేశాడు.
ఈ ప్రోమోను చూసి జనాలు ఏడ్చేస్తున్నారు. రోహిణి అక్క అలా చెప్పగానే ఎంతమందికి బాధ కలిగింది రాఖీ పండుగ అందరికీ ఇష్టం, ఏడిపించేశారు భాయ్యా సూపర్ ప్రోమో అన్నా చెల్లెళ్ల బంధం చాలా గొప్పది అందరూ చెల్లెళ్లు అందరూ అక్కలు బాగుండాలి లవ్ యూ సిస్టర్స్, బబ్లూ భయ్యా చాలా రోజుల తర్వాత నిన్ను చూస్తున్నందుకు సంతోషించాలో నువ్వు చెప్పిన మ్యాటర్ విని బాధపడాలో తెలియట్లేదు భయ్యా అని ఇలా ఎమోషనల్ అవుతున్నారు.