Chandoo Mondeti : నాగ చైతన్యతో చందూ మొండేటి కొత్త ప్రయోగం.. తెనాలి రామకృష్ణగా..!
ప్రధానాంశాలు:
Chandoo Mondeti : నాగ చైతన్యతో చందూ మొండేటి కొత్త ప్రయోగం.. తెనాలి రామకృష్ణగా..!
Chandoo Mondeti : చందూ మొండేటి- నాగ చైతన్య Naga Chaitanya కాంబోలో వచ్చిన తండేల్ చిత్రం పెద్ద హిట్ అయింది. శోభితతో వివాహం తర్వాత చైతూ నుండి వచ్చిన చిత్రం ఇదే కాగా, ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే తాజాగా ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్ వేడుక నిర్వహించారు. కింగ్ నాగార్జున ఈ ఈవెంట్‌కి స్పెషల్ గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్ చందు మొండేటి కీలక ప్రకటన చేశారు. నాగ చైతన్యతో Naga Chaitanya ఓ హిస్టారికల్ సినిమా చేయబోతున్నట్లు చందు చెప్పారు.
నా లక్కీ ఛార్మ్ విశాఖ క్వీన్.. మీ లక్కీ ఛార్మ్ కూడా విశాఖ క్వీన్.. నాగార్జున Nagarjuna గారు చైతన్యకి ఈ హిట్ రావడం ఎంత సంతోషమో.. అంతకంటే రెట్టింపు సంతోషం మాది.. ఇది నిజం. ఇక్కడితో మొదలు ఇక అన్నీ సిక్సర్లే. ముందుగా దేవి గారు ఈ కథని మీరు అర్థం చేసుకున్నట్లు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేదు.. అందుకే అంత బాగా మ్యూజిక్ వచ్చింది. ఎడిటర్ నవీన్ నూలీకి థాంక్స్. నా లైఫ్‌లో నేను చాలా విషయాలు మా నాన్న గారెని చూసి నేర్చుకున్నా. అంతకన్నా ఇంకా గొప్ప క్వాలిటీస్ అరవింద్ గారిలో కనిపించింది.
ఆయన స్థితప్రజ్ఞుడు. శోభిత గారు మీరు ఆయనకి ఇంకా తెలుగు నేర్పించాల్సిందే. ఫ్యూచర్‌లో ఒక గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. తెనాలి రామకృష్ణ అనే కథ మళ్లీ అత్యద్భుతంగా రాసి ఈ తరానికి ఎలా చెప్పాలి.. ఎలా చెయ్యాలి అనేది చేస్తాం.. నాగేశ్వరరావు గారు చేసినటువంటి అభినయం ఆయన చేస్తారు అని చందూ మొండేటి కీలక ప్రకటన చేశారు. దీంతో అక్కినేని అభిమానులలో ఆనందం వెల్లి విరిసింది.