Bunny Vasu : ఏపీఎస్ఆర్టీసీలో తండేల్ ప్రదర్శన.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బన్నీ వాసు
ప్రధానాంశాలు:
Bunny Vasu : ఏపీఎస్ఆర్టీసీలో తండేల్ ప్రదర్శన.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బన్నీ వాసు
Bunny Vasu : యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి Sai pallavi ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం తండేల్ thandel . ఈ మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. నాగ చైతన్య Naga chaitanya సినిమా కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టింది ఈ చిత్రం. తండేల్ విడుదలైన రెండో రోజే ఆన్‌లైన్ లీక్ కావడం ,ఈ సినిమాను పైరసీ చేసి కొందరు ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేయడం గమనార్హం. ఓ లోకల్ ఛానల్‌లోనూ ఈ మూవీ ప్రసారమైంది. తాజాగా పైరసీ వ్యవహారంపై తండేల్ మూవీ నిర్మాత బన్నీ వాసు Bunny Vasu స్పందించారు.
![Bunny Vasu ఏపీఎస్ఆర్టీసీలో తండేల్ ప్రదర్శన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బన్నీ వాసు](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Bunny-Vasu-2.jpg)
Bunny Vasu : ఏపీఎస్ఆర్టీసీలో తండేల్ ప్రదర్శన.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బన్నీ వాసు
Bunny Vasu బన్నీ వాసు సీరియస్..
ఇప్పటికీ పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీకి అవరోధంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పనులకు పాల్పడేవారిని వదిలిపెట్టమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాను సైతం లోకల్ ఛానెల్‌లో ప్రదర్శించారు. ఇప్పుడు తండేల్‌ను పైరసీ చేసినవారిని కేసులు పెడతామని నిర్మాత బన్నీవాసు హెచ్చరించారు.ఓ మీడియా సంస్థలో వచ్చిన న్యూస్ ద్వారా APSRTC ఏపీఎస్ఆర్‌టీసీకి చెందిన బస్సులో తండేల్ పైరసీ వెర్షన్ ను ప్రదర్శించినట్లు మా దృష్టికి వచ్చింది.
ఇది చట్టవిరుద్ధం, అన్యాయం. సినిమా కోసం రేయింబవళ్లు అవిశ్రాంతంగా కష్టపడిన ఎంతోమందిని అవమానించడం కూడా. ఒక మూవీ ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్టుల కల అని బన్నీవాసు పేర్కొన్నారు. ఇలాంటివి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని APSRTC ఏపీఎస్‌ఆర్‌టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావును నిర్మాత కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.