Chinmayi : ప్రెగ్నెంట్ అయిన మూడేళ్లకే అబార్షన్ అయిందంటూ ఎమోషనల్ అయిన చిన్మయి
Chinmayi : చిన్మయి శ్రీపాద.. ఈపేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సమంతకి డబ్బింగ్ అందించి ఆమె విజయంలో కీలక పాత్ర పోషించింది చిన్మయి. సింగర్‌గాను తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఆమెను కొందరు ఫెమినిస్ట్ అంటే మరికొందరు పురుష ద్వేషి అనేవారు. తన కెరీర్లో డబ్బింగ్ చెప్పిన, పాటలు పాడిన సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో ఫేమస్ అయిన చిన్మయి హీరో, తరువాతి కాలంలో మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆమె తాను గర్భవతిని అనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. 21 జూన్ 2022న ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం.
కవలలు ఇద్దరిలో ఒకరికి ద్రిప్త అని.. మరొకరికి శర్వాస్ అని పిల్లల పేర్లు కూడా రివీల్ చేశారు. అయితే తాజాగా చిన్మయి తన ప్రెగ్నెన్సీ స్టోరీని నెటిజన్లతో పంచుకుంది. తన స్వంత యూట్యూబ్ ఛానల్‌లో ఈ మేరకు వీడియోను షేర్ చేసింది. ‘నేను, రాహుల్ ఎప్పటినుంచో తల్లిదండ్రులు కావాలనుకున్నాం. 2020లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నాం. కానీ అప్పుడు కరోనాతో ప్రపంచమంతా తలకిందులయ్యింది. మా డాక్టర్ కూడా బయట ఏం జరుగుతుందో తెలియదు.. సెకండ్ వేవ్ అయిపోయాక నేను గర్బవతిని అయ్యాను. కానీ మూడు నెలలకే గర్భస్రావం(అబార్షన్)అయ్యింది. దీంతో చాలా బాధపడ్డాను. కొన్నిరోజులకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెడిషనల్ చైనీస్ మెడికల్ డాక్టర్ ఎమిలీ నాకు పరిచయం అయ్యింది.
తన సలహాతో నా డైట్, ఎక్సర్‌సైజ్ అన్నీ పాటించాను. అవి దాదాపు మన ఇండియన్ ఆయుర్వేదిక్ పద్దతులే. ఇక కొంతకాలానికి నేను మళ్లీ గర్భం దాల్చాను. కవలలకు జన్మనిచ్చాను. 37ఏళ్ల వయసులో తల్లి అయ్యాను’ అంటూ చిన్మయి తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. తమిళ్ లిరిసిస్ట్ వైరముత్తుపై ‘మీటూ’ ఆరోపణలు చేసిన తర్వాత, చిన్మయి సెలబ్రిటీలను మొదలుకొని వివిధ రంగాలలో మహిళలను వివిధ రకాలుగా వేధించే పురుషులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తోంది. వేధింపుల వ్యవహారాలను ఖండిస్తూ నిరంతరం తన స్వరం పెంచుతోంది. తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నిరంతరం వ్యక్తిగత దాడులకు గురవుతున్న చిన్మయి ఎక్కువగా పురుష ద్వేషి అనే ముద్ర వేయించుకుంది.