Chiranjeevi : చిరంజీవి ‘మెగా 154’ సినిమా స్టోరి లీక్.. మెగాస్టార్ రోల్ ఇదే..!
Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. ఇక ఆ సినిమా తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చారిత్రక సినిమా చేసిన చిరు.. ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒకే నెలలో నాలుగు సినిమాల షూటింగ్స్ చేసి అరుదైన రికార్డు క్రియేట్ చేశారు చిరంజీవి. కాగా, బాబీ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరు నటిస్తున్న 154వ చిత్ర కథకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి ప్రజెంట్ చర్చనీయాంశమవుతున్నది.చిరు-బాబీ కాంబో మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.
ఈ క్రమంలోనే ఇందులో ఫుల్ మాస్ రోల్‌ను చిరంజీవి ప్లే చేయబోతున్నారనే విషయం ఫస్ట్ లుక్‌ను బట్టి అర్థమవుతోంది. కాగా, తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఈ సినిమా గురించి అందుతున్న అప్‌డేట్స్ ప్రకారం.. చిరంజీవి ఈ చిత్రంలో మహేశ్ బాబు ‘పోకిరి’ సినిమాలో మాదిరిగా తొలుత మాస్ పాత్రలో కనిపించినప్పటికీ చివరలో మాత్రం పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి చిరంజీవి కూలీగా ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది.అలా అక్రమార్కుల అంతు చూసే సిన్సియర్ పోలీసు ఆఫీసర్‌గా చిరంజీవి కనిపించబోతున్నారని సమాచారం. చూడాలి మరి ఈ కథలో నిజమెంత ఉందో.. ఇకపోతే చిరంజీవి నటించిన ‘ఆచార్య’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది.

chiranjeevi 154 th film story leaked
Chiranjeevi : మెగా అభిమానులకు ఇక పూనకాలే..
ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ ‘సిద్ధ’అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశాడు. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తూనే ప్యారలల్‌గా మోహన్ రాజా డైరెక్షన్‌లో ‘గాడ్ ఫాదర్’ ఫిల్మ్ చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి ‘భీష్మ’ ఫేమ్ యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్పిన స్టోరికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య ప్రొడ్యూస్ చేయబోతున్నారని సమాచారం. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు.