Chiranjeevi : నీకో దండం చిరంజీవి .. ఆ పని మాత్రం చెయ్యకు .. మొత్తుకుంటున్న చిరంజీవి ఫ్యాన్స్ !
Chiranjeevi : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ భోళా శంకర్ ‘ సినిమా చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. చిరంజీవి గత సినిమా ‘ వాల్తేరు వీరయ్య ‘ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతకుముందు చేసిన సినిమాలన్నీ చిరంజీవికి అంతగా గుర్తింపు తేలేదు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన చిరంజీవి ఇప్పుడు ఎక్కువగా రీమేక్ లపై ఆసక్తి చూపిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో కూడా చిరంజీవి రీమేక్ సినిమాలు చేశారు. చట్టానికి కళ్ళు లేవు, ఖైదీ, విజేత, పసివాడి ప్రాణం, ఘరానా మొగుడు, హిట్లర్, ఠాగూర్ బ్లాక్ బస్టర్ సినిమాలన్ని రీమేక్ సినిమాలే.
ఆ సినిమాలతో చిరంజీవి మెగాస్టార్ అయ్యారు. మరి ఇప్పుడు ఎందుకు రీమేక్ ల గురించి అభిమానులు బాధపడుతున్నారు అంటే అప్పట్లో సోషల్ మీడియా ఓటిటి లాంటివి లేవు. కానీ ఇప్పుడు ప్రేక్షకులకు ఇవన్నీ ఉన్నాయి. ఏ భాషలో విడుదలైన సినిమా అయినా సబ్ టైటిల్స్ లేదా వారి వారి భాషలో డబ్బింగ్ ఆడియోతో వినేసి చూసేస్తున్నారు. ఒక సినిమా హిట్ అయితే ఆ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులు ఆ సినిమాని చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి ఎందుకు రీమేక్ సినిమాల పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థం కావడం లేదు.
వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అనుకున్న తర్వాత ఎన్నో సంవత్సరాల క్రితం తమిళంలో విడుదలైన వేదాళం సినిమాకి రీమేక్ గా ‘ భోళాశంకర్ ‘ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. తాజాగా విడుదలైన భోళాశంకర్ ట్రైలర్ కి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కొందరు ఇది వాల్తేరు వీరయ్య, ఠాగూర్ లాంటి సినిమాలను పోలి ఉందని కామెంట్ చేస్తున్నారు. వేదాళం సినిమా ఎప్పుడో 2015లో విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాను ఓటిటి ప్లాట్ఫారంలో తెలుగు ప్రేక్షకులు ఎంతోమంది చూశారు. అయితే ఆ కథను తీసుకొని అది కూడా ప్లాఫ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కి దర్శకత్వం ఇచ్చి చిరంజీవి సినిమా ఎందుకు చేస్తున్నారో, ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గరి నుంచి అభిమానులు బాధపడుతున్నారు.