Bhola Shankar Movie : సినిమా రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేసిన భోళా శంకర్.. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎన్ని కోట్లు అంటే?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: August 10, 2023, 8:00 pm

Bhola Shankar Movie : ప్రస్తుతం భోళా శంకర్ మేనియా వచ్చేసింది. ఎక్కడ చూసినా భోళా శంకర్ మేనియా కనిపిస్తోంది. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమా రిలీజ్ అవుతోంది అంటే మామూలుగా ఉంటుందా? రచ్చ రచ్చ కావాల్సిందే. బాక్సాఫీసు బద్దలైపోవాల్సిందే. రికార్డులన్నీ తిరగరాయాల్సిందే. సినిమా విడుదల కాకముందే భోళా శంకర్ మూవీ పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే.

నైజాం ఏరియాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.22 కోట్లుగా ఉంది. ఇక.. సీడెడ్ ఏరియాలో రూ.12 కోట్లు, యూఏలో రూ.9.50 కోట్లు, ఈస్ట్ రూ.6.20 కోట్లు, వెస్ట్ రూ.4,40 కోట్లు, గుంటూరు రూ.6 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.4.50 కోట్లు, నెల్లూరులో రూ.3 కోట్లు.. మొత్తంగా తెలుగు రాష్ట్రాలు రెండు తెలంగాణ, ఏపీ కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.67.60 కోట్లు అయింది.ఇక.. కర్ణాటకతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.5 కోట్లు, ఓవర్సీస్ లో రూ.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

chiranjeevi bhola shankar movie pre release business

chiranjeevi bhola shankar movie pre release business

Bhola Shankar Movie : రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది?

అంటే తెలుగు రాష్ట్రాలు, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అన్నీ కలిపి టోటల్ బిజినెస్ రూ.80 కోట్లు అయింది. ఇక.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ మరో రూ.80 కోట్లు. రూ.80 కోట్ల కలెక్షన్ వచ్చిందంటే ఈ సినిమా హిట్ అని చెప్పుకోవాలి. అయితే.. అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో అమ్ముడు పోయాయి. ఏది ఏమైనా భోళా శంకర్ మూవీ రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో వెయిట్ చేయాల్సిందే.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp