Chiranjeevi : చిరంజీవికి ఈ తిప్పలు అవసరమా?.. ఓ హీరోను పట్టుకోవడం కష్టమైతే ఎలా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : చిరంజీవికి ఈ తిప్పలు అవసరమా?.. ఓ హీరోను పట్టుకోవడం కష్టమైతే ఎలా?

Chiranjeevi : చిరంజీవి చేస్తోన్న పనులు ఇప్పుడు అభిమానులనే ఆగ్రహానికి గురి చేసేలా ఉంటున్నాయి. మరీ నాసిరకంగా సినిమాలను ఎంచుకుంటున్నాడు. పనీ పాట లేనట్టుగా.. చెత్త సినిమాలను రీమేక్ చేస్తున్నాడు. ఎప్పుడో వచ్చిన చిత్రాలను ఇప్పుడు రీమేక్ చేస్తున్నాడు. అందులో ఒకటే భోళా శంకర్. తమిళంలో వచ్చిన వేదాళం సినిమాను ఇప్పుడు భోళా శంకర్ అంటూ తీస్తున్నాడు. అది కూడా మెహర్ రమేష్ వంటి దర్శకుడితో. ఆచార్య చిత్రం డిజాస్టర్ అవ్వడంతో చిరంజీవి తదుపరి సినిమాపై అభిమానులు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 July 2022,5:30 pm

Chiranjeevi : చిరంజీవి చేస్తోన్న పనులు ఇప్పుడు అభిమానులనే ఆగ్రహానికి గురి చేసేలా ఉంటున్నాయి. మరీ నాసిరకంగా సినిమాలను ఎంచుకుంటున్నాడు. పనీ పాట లేనట్టుగా.. చెత్త సినిమాలను రీమేక్ చేస్తున్నాడు. ఎప్పుడో వచ్చిన చిత్రాలను ఇప్పుడు రీమేక్ చేస్తున్నాడు. అందులో ఒకటే భోళా శంకర్. తమిళంలో వచ్చిన వేదాళం సినిమాను ఇప్పుడు భోళా శంకర్ అంటూ తీస్తున్నాడు. అది కూడా మెహర్ రమేష్ వంటి దర్శకుడితో. ఆచార్య చిత్రం డిజాస్టర్ అవ్వడంతో చిరంజీవి తదుపరి సినిమాపై అభిమానులు కంగారు పడుతున్నారు. ఇక ఈ భోళా శంకర్ కథ ఇలా ఉంటే.. మలయాళంలో వచ్చిన లూసిఫర్‌ను గాడ్ ఫాదర్ అంటూ తెరకెక్కిస్తున్నాడు. మొన్నీ మధ్య చిన్న గ్లింప్స్ వచ్చింది.

అందులో చిరంజీవిని చూసి అందరూ నవ్వుకున్నారు. ఆ గెటప్ ఏంటి.. ఆ డ్రెస్ ఏంటి.. అని నవ్వుకున్నారు. గాడ్ ఫాదర్ మీద లెక్కలేనన్ని ట్రోల్స్ జరిగాయి. ఇప్పుడు భోళా శంకర్ ప్రాజెక్ట్ మీద ట్రోలింగ్ మొదలైంది. అసలే ఈసినిమాను ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నట్టుగా అనిపిస్తోంది. చిరంజీవికి ఈ తిప్పలు అవసరమా? అన్నట్టుగా కనిపిస్తోంది. మెగాస్టార్ సోలోగా సినిమాలు చేయడం మానేసారు. ఏవరో ఒక హీరో తోడు వుంటాల్సిందే. ఆచార్య కు రామ్ చరణ్, గాడ్ ఫాదర్ కు సల్మాన్, వాల్తేర్ వీరయ్యకు రవితేజ లను తీసుకున్నారు. ఇప్పుడు అలాగే ఈ భోళాశంకర్ కు కూడా మరో యంగ్ హీరో తోడు కావాలట. అయితే ఈ హీరో ఎవరు? అన్నది ఎంతకీ తేలడం లేదని తెలుస్తోంది.

Chiranjeevi Bholaa Shankar Needa A Young Hero

Chiranjeevi Bholaa Shankar Needa A Young Hero

చిరంజీవి సినిమాకు ఇలాంటి గతి రావడం ఏంటి? అని అందరూ అనుకుంటున్నారు. భోళా శంకర్ కోసం హీరో నితిన్‌ను అడిగారు. కానీ ఇప్పటి వరకు ఎస్ ఆర్ నో అన్నది తెలియలేదట. అందుకే అలా పెండింగ్ లో వుంచినట్లు తెలుస్తోంది. నితిన్ కాదంటే ఆ రేంజ్ యంగ్ హీరో ఎవర్నయినా తీసుకోవాలి. మరో మెగా హీరో తొడు తీసుకోవడం అన్నది మెగాస్టార్ కు ఇష్టం లేనట్లు వుంది. లేదూ అంటే సాయిథరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ అంటూ ముగ్గురు వుండనే వున్నారు. కానీ బయట హీరో కోసం వెదుకులాడుతున్నారట. ఆ క్రమంలోనే ఈ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా చిరంజీవి సినిమాల మీద బయట రకరకాల ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది