Bholaa Shankar Trailer : పవన్ కళ్యాణ్ మేనరిజంతో చిరు “భోళా శంకర్” ట్రైలర్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: July 27, 2023, 4:24 pm

Bholaa Shankar Trailer : మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన “భోళా శంకర్” ఆగస్టు 11 వ తారీకు విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్ లు అదేవిధంగా పాటలు మెగాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా “భోళా శంకర్” ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ లో చిరంజీవి చాలా స్టైలిష్ గా కనిపించారు. డైలాగులతో పాటు.. పవన్ కళ్యాణ్ మేనరిజంతో.. కొన్ని డైలాగులు సినిమాలో చిరంజీవి చెప్పినట్లు ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ అభిమానిగా సినిమాలో చిరంజీవి నటించినట్లు ప్రచారం జరిగింది. ఆ తరహా లోనే “భోళా శంకర్” ట్రైలర్ లో చిరంజీవి ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఆనందంగా ఉన్నారు. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో తమిళంలో.. సూపర్ డూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకి తెలుగులో “భోళా శంకర్” గా రీమేక్ చేయడం జరిగింది. చిరంజీవి చెల్లెలు పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించడం జరిగింది. తాజాగా విడుదలైన “భోళా శంకర్” ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. ఇటీవల చిరంజీవి నటించిన అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమాలో చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.

Chiranjeevi Bholaa Shankar Trailer Release

Chiranjeevi Bholaa Shankar Trailer Release

జబర్దస్త్ గెటప్ శీను మరోసారి చిరంజీవి పక్కన.. కామెడీ పాత్రలో కనిపించడం జరిగింది. గతంలో చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ తరహా కామెడీ కూడా ఈ సినిమాలో.. ఉన్నట్లు ట్రైలర్ లో కొన్ని సీన్స్ కనిపించాయి. ఇక యంగ్ హీరో సుశాంత్ సైతం… నటించడం విశేషం. ఆగస్టు 11వ తారీకు విడుదల కాబోతున్న “భోళా శంకర్” ట్రైలర్ మెగా ఫ్యాన్స్ ని చాలా ఆకట్టుకునే విధంగా ఉంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp