
Chiranjeevi : మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా వంద కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఇప్పడు సినిమా అందులో సగం కూడా వసూళ్లు చేయడం లేదు.. దాంతో బయ్యర్లను చిరంజీవి ఆదుకోవాలంటూ ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతో చిరంజీవి అభిమానులు ఈ సమయంలో ఒక ఆసక్తికర విషయాన్ని తెర ముందుకు తీసుకు వచ్చి ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.ఆచార్య సినిమా ప్లాప్ వల్ల బయ్యర్లు నష్టపోయిన మాట వాస్తవమే.. కాని చిరంజీవి బయ్యర్లు నష్టపోయిన దానికి పది రెట్లు నష్టపోయాడు..
ఆయనకు నష్ట పరిహారం చెల్లించేది ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆచార్య సినిమా ప్లాప్ వల్ల ఆయన తదుపరి సినిమాల మార్కెట్ పూర్తిగా డౌన్ అవుతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బుల్లో వాటాగా తన పారితోషికంను చిరంజీవి తీసుకునేలా ఒప్పందాలు ఉంటాయి. అలాంటప్పుడు ఆచార్య ప్లాప్ ఆ సినిమాలపై ప్రభావం పడటం మాత్రమే కాకుండా చిరంజీవికి రావాల్సిన మొత్తంలో భారీ మొత్తం కట్ అవుతుంది.చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్.. గాడ్ ఫాదర్.. వాల్తేరు వీరన్న సినిమాలు మాత్రమే కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేస్తున్నాడు.
కేవలం ఈ నాలుగు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లపై ప్రభావం పడటం వల్ల చిరంజీవికి వందల కోట్ల పారితోషికం తగ్గే అవకాశం ఉందని.. ఆయన ఈ నష్టంను ఎవరు భరిస్తారు అంటున్నారు. ఆ నాలుగు సినిమాల్లో ఏదో ఒక సినిమా సక్సెస్ అయితేనే ఆయనకు కనీసం మిగులుబాటు ఉంటుంది. కనుక ఆయన్ను కూడా ఈ విషయంలో విమర్శించడానికి లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు. చిరంజీవిని రిక్వెస్ట్ చేసి తదుపరి సినిమా హక్కులను ఇవ్వమనాలే కాని డిమాండ్ చేసి డబ్బులు వసూళ్లు చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.