Chiranjeevi : పవన్ కళ్యాణ్ కి చిరంజీవి చేయాల్సిన చివరాఖరి హెల్ప్ ఇదే !
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ ఎవరికి లేదేమో. తన తొలి సినిమా నుంచి ఇప్పటి సినిమాల వరకు చిరుకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ క్రేజ్ తోనే చిరంజీవి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. కానీ ఆయన అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో మళ్లీ సినిమాలోకి వచ్చి పడ్డాడు. కానీ అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వెళ్ళాడు. అయితే పవన్ కి రాజకీయ విషయంలో ఏ రకమైన సహకారం అందిస్తాడని విషయంలో ఉన్న అయోమయానికి చిరంజీవి తెరదించేశాడు. రాజకీయాలకు బైబై చెప్పేశాక చిరు సైలెంట్ గా ఉండటమే పవన్ కు చేసే అతి పెద్ద సాయం అనే విషయాన్ని చిరు బాగానే అర్థం చేసుకున్నట్లున్నారు.
పవన్ కంటే పెద్ద స్టేటస్ ఉన్న చిరు రాజకీయాల్లో ఫెయిల్ అయి బయటికి వచ్చేసాక మళ్లీ పవన్ కోసం పని చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి చెప్పిన చెప్పకపోయినా పవన్ కు మద్దతు ఉన్నట్లే. చిరంజీవి రంగంలోకి దిగి పవన్ కోసం పనిచేసిన తన మద్దతు ప్రకటించిన జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే చిరు పాలిటిక్స్ లో ఫెయిల్ అయ్యారు కాబట్టి. చిరంజీవి నెగటివ్ ఎఫెక్ట్ పవన్ మీద గట్టిగానే పడిందన్నది కూడా నిజమే. ప్రస్తుతానికి చిరంజీవి ఏమి చేయకుండా సైలెంట్ గా ఉండడమే పవన్ కు మంచిది. అయితే దీంతో పాటు పవన్ కు చిరంజీవి చేయాల్సిన హెల్ప్ ఇంకొకటి ఉంది.
పవన్ తనకు ప్రధాన రాజకీయ ప్రత్యక్తిగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వీలైనంతవరకు దూరంగా ఉండడమే. ఆయనతో ఏం శత్రుత్వం పెట్టుకోవాల్సిన పనిలేదు కానీ సన్నిహిత సంబంధాల కోసం ఆయన మెప్పు కోసం ప్రయత్నించడం వల్ల పవన్ కు జరుగుతున్న నష్టం ఎక్కువ. మూడు రాజధానుల విషయంలో మద్దతు ప్రకటించడం, వివిధ సందర్భాలలో జగన్ తో సన్నిహితంగా ఉండడం, ట్విట్టర్ సందర్భానుసారం జగన్ మెచ్చుకోవడం లాంటి వాటి వల్ల పవన్ కు చాలా నష్టమే జరిగింది. వైకాపాను, జగన్ ను చిరంజీవి టార్గెట్ చేయకపోయినా పర్వాలేదు కానీ దూరంగా ఉంటే చాలు అన్నది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్న మాట.