Chiranjeevi : చిరంజీవికి కేక్‌లో విషం పెట్టాలని ప్లాన్.. జస్ట్‌లో మిస్ అయ్యాడు..!
Chiranjeevi :తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి అంచనాలు లేకుండా నటనపై ఆసక్తితో తన టాలెంట్ ను నమ్ముకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి మొదట్లో విలన్‌గా నటించి ఆ తర్వాత హీరోగా ఎదిగారు. క్రమక్రమంగా స్టార్ హీరో అయ్యాడు. మెగాస్టార్‌గా అందరి మన్ననలు పొందారు. అయితే చిరంజీవి విజయాన్ని చూసి కొందరు ఓర్వలేక అతనిపై శత్రుత్వం పెంచుకున్నారు. ఒకానొక సమయంలో అతనిని చంపేయాలని విషప్రయోగం కూడా చేశారు. మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో ఏ గాడ్ ఫాదర్ లేకున్న.. స్వయంకృషితో మెగాస్టార్ గా నిలిచారు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని.. టాలెంట్ ను నమ్ముకుని.. చాలామంది దర్శక నిర్మాతల దృష్టిలో పడి.. ఇండస్ట్రీ ని శాసించే స్థాయికి చిరంజీవి రావడం జరిగింది.
అప్పటి వరకు ఉన్న హీరోలను దాటి చిరంజీవి అగ్ర హీరోగా ఎదిగారంటే ఆయన హార్డ్ వర్క్, క్రమ శిక్షణ, కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే తాపత్రయం కారణం. ఫైట్స్‌తో పాటు డాన్సులను ఆయన ప్రధాన బలంగా మార్చుకున్నారు. మెల్ల మెల్లగా యూత్‌కు కనెక్ట్ అవుతూ వచ్చారు. ఎన్నో అవమానాలను భరించారు. ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. ఎక్కడా అవకాశం దక్కినా తనేంటో ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఖైదీ చిత్రం తర్వాత ఎవరూ ఊహించని రీతిలో మాస్ ఇమేజ్‌తో చిరంజీవి దూసుకెళ్లారు ఎవరిపైనా నెగిటివ్ మాట్లాడకుండా తన పని తాను చూసుకుంటూ చక్కటి సినిమాలను ఎంచుకుని విజయాలను సాధించటంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు చిరంజీవి. దీంతో ఆయనంటే గిట్టని కొంత మంది ఏకంగా చిరంజీవి చంపడానికే ప్లాన్ వేశారు. మాస్‌లో మంచి ఇమేజ్ రావటంతో చిరంజీవి షూటింగ్ చేసే ప్రదేశాలకు ఫ్యాన్స్ విపరీతంగా వచ్చేవారు. షూటింగ్ గ్యాప్‌లో అభిమానులను కలసుకుని వారికి ఫొటోగ్రాఫ్‌లను ఇచ్చేవారు చిరంజీవి.
మరణ మృదంగం సినిమా షూటింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవికి కేక్ లో విషం పెట్టి అతనిపై విష ప్రయోగం చేసిన సంఘటన అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. మద్రాసులో ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో మేనేజర్ వచ్చి బయట మీ కోసం అభిమానులు చాలా సేపటినుంచి ఎదురు చూస్తున్నారు అని చెప్పారు. అలా అభిమానులు ఎదురు చూస్తున్నారు అని తెలియడంతో ఒకసారి వెళ్లి హాయ్ చెప్పాలని చిరంజీవి గేట్ వరకు వెళ్లారు.చిరంజీవి అలా వెళ్ళగానే ఒక అభిమాని అతని కాళ్లపై పడి ఈ రోజు నా పుట్టినరోజు తప్పనిసరిగా మీరు పక్కనుండి కేక్ కట్ చేయించాలి అని చెప్పారు.అభిమాని బ్రతిమిలాడడంతో చిరంజీవి కాదనలేక తన పక్కన నిలబడి కేక్ కట్ చేయించి తనకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసిన అభిమాని చిరంజీవి కేక్ తినిపించాలని ప్రయత్నం చేశాడు. చిరంజీవి తాను తినని ప్రస్తుతం సినిమా షూటింగ్ లో ఉన్నాను కనుక తినను అని చెప్పారు.
చిరంజీవి వద్దంటున్న అభిమాని చిరంజీవి నోట్లో కేక్ పెట్టారు.చిరంజీవి వద్దంటూ కింద పడేశారు. ఆ పెనుగులాటలో కేక్ మొత్తం కిందపడిపోయింది. అయితే ఆ కేక్ లో మధ్యలో రంగు అధికంగా ఉండేసరికి చిరంజీవికి అనుమానం వచ్చి నోరు మొత్తం కడుక్కున్నారు. అప్పటికే అతని పెదాలు మొత్తం నీలం రంగులోకి మారాయి. నిర్మాతలకు విషయాన్ని వివరించి వెంటనే డాక్టర్స్ దగ్గరకు వెళ్లారు చిరంజీవి. విష పదార్థం వల్లనే రంగు మారుతుందని వైద్యులు చెప్పారు. ఆ విషం లోపలికి వెళ్లకుండా ఉండేలా వాంతులు అయ్యేలా టాబ్లెట్స్ ఇచ్చారు. రాత్రంతా చిరంజీవి హాస్పిటల్‌లోనే ఉన్నారట. ఏ సమస్య లేదని తెలిసిన తర్వాత చిరంజీవి షూటింగ్‌కి వచ్చేశారు. కానీ ఈ వార్త అప్పటికే లీక్ అయ్యింది. ఆరోజు చిరంజీవి తెలివిగా వ్యవహరించారు కాబట్టే ఆయన బతికి బయటపడ్డారనే చెప్పుకోవాలి. చిరంజీవి తనను ప్రాణంగా ప్రేమించే వాళ్ల కోసం ఎంతో చేస్తారు. అభిమానులు, తోటి నటీనటుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా కరోనా సమయంలో చిరంజీవి సేవలు ప్రశంసనీయం.