Chiranjeevi : చిరంజీవిని నాగ‌బాబు అంత పెద్ద మాట‌లు అన్నాడా.. మెగా ఫ్యామిలీలో ఏం జ‌రుగుతుంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : చిరంజీవిని నాగ‌బాబు అంత పెద్ద మాట‌లు అన్నాడా.. మెగా ఫ్యామిలీలో ఏం జ‌రుగుతుంది?

 Authored By sandeep | The Telugu News | Updated on :13 August 2022,1:20 pm

Chiranjeevi : మెగా ఫ్యామిలీకి వ‌ట‌వృక్షంలా మారిన చిరంజీవిపై ఆయ‌న ఇద్ద‌రు త‌మ్ముళ్లు గ‌రంగా ఉన్నార‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. ఒక‌ప్పుడు ఆరెంజ్ మూవీ నిర్మాతగా మొత్తం కోల్పోయిన నాగబాబుని చిరంజీవి ఆదుకోలేదనే వాదన ఉంది. అప్పుల్లో కూరుకుపోయిన నాగబాబుకు తమ్ముడు పవన్ కొంతలో కొంత సహాయం చేశాడట. పవన్ తనకు ఆర్థిక సహాయం చేసినట్లు నాగబాబు స్వయంగా ఒకటి రెండు సందర్భాల్లో తెలియజేశాడు. అన్న జీవితం ఇచ్చాడనే కృతజ్ఞతా భావం ఎక్కడో గుండె లోతుల్లో ఉన్నప్పటికీ… అయిష్టం అనే నెగిటివ్ ఫీలింగ్ తమ్ముళ్లలో బలంగా ఉంది.

Chiranjeevi : మెగా వివాదం…

త‌మ‌ రాజకీయ ప్రత్యర్థులతో చిరంజీవి సన్నిహితంగా ఉండటం పవన్, నాగబాబులకు అసలు నచ్చడం లేదు. కాపు సామాజిక వర్గాన్ని జనసేన వైపు తిప్పుకోవాలని పవన్, నాగబాబు ఇన్ని తంటాలు పడుతుంటే.. అన్న చిరంజీవి జగన్ తో దోస్తీ చేస్తున్నాడు. కీలక వేదికలపై కలిసి కూర్చుంటున్నాడు.ఇది జనసేన వర్గాలకు నిద్రలేకుండా చేస్తున్న పరిణామం. ఇదిలా ఉంటే ఓ వారం రోజులుగా నాగబాబు సోషల్ మీడియా పోస్ట్స్ కాకరేపుతున్నాయి. నేను అంత తేలిగ్గా ఎవడినీ వదులుకోను… వదులుకున్నానంటే వాడికంటే వెధవ ప్రపంచంలో ఉండడు అంటూ ఓ పోస్ట్ చేశాడు. ఇది సన్నిహితులను ఉద్దేశించి చేసిన కామెంట్ అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక తాజా పోస్ట్ లో మరింత ఘాటైన కామెంట్ చేశాడు.

chiranjeevi gets negative in mega family

chiranjeevi gets negative in mega family

మంచి వాడు శత్రువులకు కూడా సాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు. మంచి వాళ్ళను దూరం చేసుకుంటే ముంచే వాళ్ళు దగ్గరవుతారని.. ఓ సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. ఇక్కడ తోడబుట్టిన వాళ్ళను ముంచుతున్న ఆ అన్న ఎవరనేది పెద్ద చర్చగా మారింది. జనసేనకు దూరంగా ఉంటున్న చిరంజీవిని ఉద్దేశించే నాగబాబు ఈ కామెంట్ చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాగబాబు పోస్ట్ క్రింద కామెంట్స్ చూస్తే అర్థం అవుతుంది. ఇటీవ‌ల అల్లు అర్జున్ తాత అల్లు రామలింగయ్యను తలచుకుంటూ… ఓ పోస్ట్ పెట్టారు. ‘మా పునాది’ అని కామెంట్ చేశాడు. దీనిపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగానే ఈ పోస్ట్ చేశారని అంటున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది