Chiranjeevi : జగన్‌ని కలిసేందుకు సిద్ధమైన చిరంజీవి.. ఆయనతో పాటు మహేశ్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్..
Chiranjeevi:ఏపీలో సినిమా పరిశ్రమకు సంబంధించి అనేక సమస్యలు నెలకొని ఉండగా, వాటి గురించి చర్చించేందుకు టాలీవుడ్ కదిలి వచ్చింది. మరికాసేపట్లో సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ మధ్యనే చిరంజీవి జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. మరోసారి జగన్ నుంచి చిరంజీవికి ఆహ్వానం రావడంతో ఉత్కంఠగా మారింది.సినిమా టిక్కెట్ల ధర, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుండగా, చిరంజీవితో పాటు ప్రభాస్, జూ ఎన్టీఆర్, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, నిరంజన్ రెడ్డి, అలీ వంటి ప్రముఖులు ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌ను కలవనున్నారు. సినిమా టిక్కెట్ల ధరను నిర్ణయించడానికి ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
నాగార్జున చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యారు. ప్రస్తుతం అమల కరోనాతో బాధపడుతున్న నేపథ్యంలో నాగార్జున హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే టాలీవుడ్ సమస్యలకు ఈరోజుతో శుభం కార్డం పడుతుందని అనుకుంటున్నట్టుగా తెలిపారు అరవింద్. అయితే సీఎం జగన్‌తో భేటీకి తనకు ఆహ్వానం ఉందని.. ఈ భేటీకి ఎవరెవరో వస్తున్నారో తనకు తెలియదని చిరంజీవి వ్యాఖ్యానించడం గమనర్హం. ఇప్పటికే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు సినీ ముఖులు చేరుకున్నారు. మరికాసేపట్లో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకోనున్నారు.
Chiranjeevi : అంతా మంచే జరుగుతుందా?
ఇక, సినీ ప్రముఖుల బృందం మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలుస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఇప్పటికే సీఎం జగన్‌తో సమావేశమై ఎజెండాను సిద్ధం చేశారు. టాలీవుడ్ ప్రతినిధులతో సమావేశంలో చర్చకు రావాల్సిన కీలక అంశాలపై ప్రభుత్వ వైఖరిని సిద్ధం చేశారు. ఈ భేటీలో ప్రధానంగా.. థియేటర్ ధరలు, టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్, బెనిఫిట్ షోలు వంటివి చర్చకు రానున్నాయి. గత నెలలో జగన్‌తో భేటీ అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడేందుకు తాను సీఎం పిలుపుమేరకు వచ్చి కలిసినట్టుగా చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను ఆయనకు వివరించానని తెలిపారు. సినీ పరిశ్రమకు ఒక బిడ్డగానే తానిక్కడికి వచ్చానని అన్నారు