Chiranjeevi : కూతురు కోసం చిరంజీవి అతిపెద్ద త్యాగం – చేతులెత్తి దండం పెట్టిన సురేఖ కొణిదెల !
Chiranjeevi : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ భోళాశంకర్ ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. దీని తర్వాత మెగాస్టార్ రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. కళ్యాణ్ కృష్ణ కురసాలతో పాటుగా బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి కూడా లైన్ లో ఉన్నారు. వీరిద్దరితో కూడా మెగాస్టార్ సినిమాలు చేయడానికి కమిట్ అయ్యారు. అయితే ముందుగా మెగాస్టార్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాకి నిర్మాతగా సుస్మిత కొణిదెల ను మెగాస్టార్ పరిచయం చేయబోతున్నారు.
ఇప్పటికే రామ్ చరణ్ సైరా సినిమాతో నిర్మాతగా పరిచయం చేశారు. ఇక సుస్మిత నిర్మాతగా ఒక వెబ్ సిరీస్, రెండు సినిమాలు చేశారు. అయితే అవి ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ క్రమంలోనే మెగాస్టార్ తన కూతురిని పెద్ద ప్రొడ్యూసర్ గా సెట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. మలయాళ హిట్ సినిమా బ్రో డాడీ సినిమాని రీమేక్ చేస్తున్నట్లు టాక్. ఈ సినిమాకి బెజవాడ ప్రసన్నకుమార్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించలేదు.
వీలైనంత త్వరగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళి ఈ ఏడాది ఆఖరులో లేదంటే సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత వశిష్ట మల్లిడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీతో తెరకెక్కుతుంది. మెగాస్టార్ కొత్త ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక చిరంజీవి గత సినిమా వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో మరింత జోరుగా ఉన్న మెగాస్టార్ వరుస సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాడు.