Chiranjeevi : మెగా మల్టీస్టారర్ చర్చకు మళ్లీ ఊపొచ్చిందా?.. చిరంజీవి వ్యాఖ్యలు వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : మెగా మల్టీస్టారర్ చర్చకు మళ్లీ ఊపొచ్చిందా?.. చిరంజీవి వ్యాఖ్యలు వైరల్

 Authored By ramu | The Telugu News | Updated on :10 January 2026,5:00 pm

ప్రధానాంశాలు:

  •   మెగా మల్టీస్టారర్ చర్చకు మళ్లీ ఊపొచ్చిందా?.. చిరంజీవి వ్యాఖ్యలు వైరల్

Chiranjeevi : టాలీవుడ్‌లో Tollywood మల్టీస్టారర్ సినిమాల ( Multistarrer movies )ట్రెండ్‌పై మరోసారి హాట్ డిస్కషన్ మొదలైంది. దీనికి కారణం మన శంకర వరప్రసాద్ గారి సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించనున్నారనే వార్త. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మల్టీస్టారర్ సినిమాల అవసరం వాటి విజయావకాశాలపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో గతంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిని మీరు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రాంచరణ్( Ram charan )కలిసి ఒక సినిమా చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానం మెగా అభిమానులకు షాక్ ఇచ్చింది. ముగ్గురు కలిసి నటించడం వినడానికి ఎంత ఆసక్తికరంగా ఉన్నా, ప్రాక్టికల్‌గా అది చాలా కష్టమని చిరంజీవి స్పష్టంగా చెప్పారు.

మా ముగ్గురు కాంబినేషన్‌లో సినిమా రావాలి అంటే అది సాధ్యం కాని పని లాంటిదే. కథ ఎంపిక నుంచే పెద్ద సవాళ్లు ఉంటాయి. ముగ్గురికీ సమాన ప్రాధాన్యం ఇచ్చే కథ దొరకడం కష్టం. అంతేకాదు బడ్జెట్‌ను మ్యానేజ్ చేయడం కూడా పెద్ద సమస్య అవుతుంది అని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని సినిమా సాధ్యమైతే మాత్రం అభిమానులకు అది ఒక ఐఫీస్ట్‌లా ఉంటుందని చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఆ కాంబినేషన్‌లో సినిమా రావడం కష్టమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బడ్జెట్ గురించి పట్టించుకోకుండా కేవలం అభిమానుల ఆనందం కోసమే చేస్తే మాత్రం అది పండగ వాతావరణాన్ని తీసుకొస్తుందని చిరంజీవి అన్నారు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మల్టీస్టారర్ మూవీ ‘మనం’ ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

Chiranjeevi మెగా మల్టీస్టారర్ చర్చకు మళ్లీ ఊపొచ్చిందా చిరంజీవి వ్యాఖ్యలు వైరల్

Chiranjeevi : మెగా మల్టీస్టారర్ చర్చకు మళ్లీ ఊపొచ్చిందా?.. చిరంజీవి వ్యాఖ్యలు వైరల్

ఆ సినిమా ఎమోషన్, కథ, నటన పరంగా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. అదే తరహాలో మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఒక మల్టీస్టారర్ సినిమా రావాలని అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. కానీ, చిరంజీవి చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే ఆ కోరిక ఇప్పట్లో అయితే నెరవేరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాలో నటిస్తుండగా రాంచరణ్ ‘పెద్ది’ చిత్రంలో బిజీగా ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తున్నారు. ముగ్గురు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో మెగా మల్టీస్టారర్ సినిమా ఇప్పట్లో కష్టమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా అభిమానుల ఆశ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది