Chiranjeevi : పేరు పెట్టి పిలవడానికి ఎంత ధైర్యం.. చిరంజీవి స్వీట్ వార్నింగ్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : పేరు పెట్టి పిలవడానికి ఎంత ధైర్యం.. చిరంజీవి స్వీట్ వార్నింగ్..

 Authored By mallesh | The Telugu News | Updated on :12 October 2021,7:25 am

Chiranjeevi : దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ‘పెళ్లి సందడి’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, ఆ సినిమా రిలీజ్ పాతికేళ్ల అయిన తర్వాత అదే టైటిల్‌తో అందులో హీరోగా నటించిన శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో మళ్లీ ‘పెళ్లి సందడి’ చిత్రాన్ని తీశారు రాఘవేంద్రరావు. ఈ చిత్రానికి గౌరీ రోణంకి దర్శకత్వం వహించగా, రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటు ఈ చిత్రంలో యాక్టర్‌గా నటించడం విశేషం.

chiranjeevi sweet warning to roshan

chiranjeevi sweet warning to roshan

1996లో ‘పెళ్లిసందడి’ చిత్రం 175 రోజుల ఫంక్షన్ సందర్భంగా చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన చిరు తాజాగా ‘పెళ్లి సందD’చిత్రానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ఆ టైంలో తాను ఫ్లాప్స్‌లో ఉన్నపుడు ‘పెళ్లి సందడి’ ఫంక్షన్‌కు పిలిచి రాఘవేంద్రరావు తనలో ఉత్తేజాన్ని నింపాడని గుర్తు చేసుకున్నారు.

Chiranjeevi : ఇదేనా మీరు పెంచిన పద్ధతి అంటూ శ్రీకాంత్ వైఫ్ ఉమకు మెగాస్టార్ ప్రశ్న..

ఈ క్రమంలోనే హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు మెగాస్టార్. తనను చిరంజీవిగారు అని రోషన్ సంబోధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎప్పుడూ పెదనాన్న అని అప్యాయంగా పిలిచే అలా పిలవడం ఏంటని అడిగాడు. ఇదేనా మీరు పెంచిన పద్ధతి అని శ్రీకాంత్ వైఫ్ ఉమను అడగగా, శ్రీకాంత్ వచ్చి సారీ అన్నయ్య అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు.

రోషన్ సైతం స్పందించి అందరి ముందర అలా అంటే బాగోదేమోనని అని సర్ది చెప్పే ప్రయత్నం చేయగా, మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అందరి ముందర నేను మీ నాన్నకు అన్నయ్యను నీకు పెదనాన్నను అని చెప్తాడు. దాంతో రోషన్ మెగాస్టార్ పాదాలు తాకి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అలా స్వీట్ వార్నింగ్ ఇచ్చి నవ్వులు పూయించాడు మెగాస్టార్. ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది