Chiranjeevi : చిరంజీవి నుంచి నాని వరకు అందరూ మైత్రీ మూవీస్ లోనే సెటిలయ్యారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : చిరంజీవి నుంచి నాని వరకు అందరూ మైత్రీ మూవీస్ లోనే సెటిలయ్యారు..!

 Authored By govind | The Telugu News | Updated on :12 February 2021,9:03 am

Chiranjeevi : చిరంజీవి తో సినిమా చేయాలంటే ఆ నిర్మాణ సంస్థ కి ఒక బ్రాండ్ ఉండాలి. నిర్మాతలు బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే వారై ఉండకూడదు. ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలి. మంచి దర్శకుడు.. అద్భుతమైన కథ సెట్ అవ్వాలి. అప్పుడే చిరంజీవి రేంజ్ కి తగ్గ సినిమా తయారవుతుంది. అలాంటి సినిమాని ప్రస్తుతం టాలీవుడ్ లో నంబర్ వన్ ప్రొడక్షన్స్ హౌజ్ గా క్రేజ్ ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ త్వరలో నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారకమైన ప్రకటన కూడా వెలువడబోతోంది.

chiranjeevi to nani settled by mytri movie makers

chiranjeevi-to-nani-settled-by-mytri-movie-makers

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎప్పటి నుంచో ఉన్న దిల్ రాజు కూడా ఇప్పటి వరకు మెగాస్టార్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేపోయాడు. కాని మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాతో నిర్మాణం లోకి అడుగు పెట్టిన మైత్రీ మూవీస్ సంస్థ అతి కొద్దికాలంలోనే పాన్ ఇండియన్ సినిమాలను నిర్మించే స్థాయికి వచ్చింది. అద్భుతమైన కథలతో మైత్రీ మూవీస్ భారీ హిట్స్ ని అందిస్తోంది. మహేష్ బాబు తో శ్రీమంతుడు తర్వాత ‘రంగస్థలం, జనతా గ్యారేజ్’ లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. అలాగే ‘చిత్రలహరి, మత్తువదలరా’ లాంటి మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు.

Chiranjeevi : మైత్రీ వారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతీ హీరోతో సినిమా చేయాలని డిసైడయ్యారు.

ప్రస్తుతం మైత్రీ వారు నిర్మించిన ఉప్పెన రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక అల్లు అర్జున్ – సుకుమార్ తో పుష్ప సినిమాని 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి వస్తే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఎన్.టి.ఆర్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, నాని లతో నిర్మించే సినిమాలున్నాయి. ప్రభాస్, ఎన్.టి.ఆర్ లతో మైత్రీ వారు నిర్మించే సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మించే పాన్ ఇండియన్ సినిమాలు. మొత్తానికి మైత్రీ వారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతీ హీరోతో సినిమా చేయాలని డిసైడయ్యారు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది