Chiranjeevi : ఉపాసన విషయంలో చిరంజీవి ఇప్పటికీ బాధపడుతున్నాడట.. అదేంటో తెలుసా?
Chiranjeevi : టాలీవుడ్ క్యూట్ కపుల్ రామ్ చరణ్ ఉపాసన ఎంత అన్యోన్యంగా ఉంటారనే సంగతి మనందరికి తెలిసిందే. చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ ఉపాసన పెళ్లై దాదాపు పదేళ్లు అవుతుండగా, వారికి పిల్లలు ఎప్పుడు పుడతారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పట్లో ఓ సారి ప్రగ్నెన్సీ విషయం గురించి ఉపాసనని ప్రశ్నించగా, దానికి ఆసక్తికర సమాధానం ఇచ్చింది ఉపాసన. “పిల్లలు, ప్రెగ్నెన్సీ అనేది పూర్తిగా మా పర్సనల్ విషయం. మాకు ఇప్పట్లో కావాలి అనే ఆలోచన లేదు. అలాగే నాకు ప్రెగ్నెన్సీ అంటే కొంత భయం కూడా ఉంది.
ఇప్పుడిప్పుడే నేను లావు తగ్గుతూ వస్తున్నాను.చరణ్ కు నాకు ఓ ప్లాన్ ఉంది. పిల్లల్ని ఎప్పుడు కనాలనే విషయంలో మాకు ఓ క్లారిటీ ఉంది” అని ఉపాసన అప్పుడు ఎప్పుడో చెప్పింది. ఇటీవల కూడా ఉపాసన ప్రెగ్నెన్సీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్త చూసి మెగా శిబిరాలు తెగ సంబరపడిపోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్న కల నిజం కానుందని తెలుస్తుండటంతో మెగా శిబిరాల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి.

Chiranjeevi unhappy with ram charan marriage
Chiranjeevi : ఇప్పటికీ అదే బాధ..
మెగా ఫ్యామిలీలోకి బుల్లి వారసుడు వచ్చే సమయం దగ్గరలోనే ఉందని ఫిలిం నగర్ లో టాక్ ముదిరింది. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారని, ఇలా చిరంజీవి కోరిక నెరబోతుందని చెప్పుకుంటున్నారు జనం. అయితే ఈ విషయంపై చిరంజీవి హ్యాపీగా ఉన్నా కూడా ఓ విషయంలో మాత్రం ఇప్పటికీ బాధగా ఫీలవుతున్నాడట. రామ్ చరణ్ కన్నా ఉపాసన వయసులో పెద్ద . వినడానికి షాకింగ్ గా ఉన్న ఇదే నిజం. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ విషయంలో చిరు ఎలాంటి అడ్డంకులు చెప్పదలచుకోలేదు. కాని తన కొడుక్కి అంత పెద్ద అమ్మాయిని ఇచ్చానని ఇప్పటికీ కొంత బాధగా ఉంటడట చిరంజీవి.