చిరంజీవి అడిగినా కూడా ఒప్పుకోలేదట.. చేయనని మొహం మీద చెప్పేసిన చోటా కే నాయుడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

చిరంజీవి అడిగినా కూడా ఒప్పుకోలేదట.. చేయనని మొహం మీద చెప్పేసిన చోటా కే నాయుడు

 Authored By uday | The Telugu News | Updated on :15 December 2020,12:59 pm

టాలీవుడ్ టాప్ సినిమాటోగ్రఫర్ చోటా కే నాయుడు ఫ్రేమ్‌లో కనబడటంతో ఎంతో మంది హీరోయిన్లు, హీరోలు తెరపై స్టార్స్‌గా వెలిగారు. ఒకానొక సమయంలో చోటా కే నాయుడు లేని సినిమాలు వచ్చేవి కావు. ఓ దర్శకుడితో చోటాకు సింక్ కుదిరితే వరుసగా సినిమాలు వచ్చేవి. అయితే చోటా ప్రయాణం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో మొదలైంది. కెమెరామెన్ అసిస్టెంట్‌గా మొదలెట్టిన ప్రయాణం టాప్ సినిమాటోగ్రఫర్‌ వరకు వచ్చింది. చోటాకు మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఎంతో మంచి బంధం ఉంది.

చిరంజీవి అడిగినా కూడా ఒప్పుకోలేదట చేయనని మొహం మీద చెప్పేసిన చోటా కే నాయుడు

Chota k naidu about Rejecting Chiranjeevi Offer

అసిస్టెంట్‌గా ఉన్న సమయం నుంచి చిరుతో సన్నిహితంగా మెలిగేవాడు చోటా. చిరుకు కెమెరాపై చాలా నాలెడ్జ్ ఉన్నసంగతి తెలిసిందే. అలా తనకున్న అనుమానాలన్నీ కూడా చోటాను అడిగి తెలుసుకునేవాడట చిరు. ఏ యాంగిల్ పెడుతున్నారు.. ఏ లెన్స్ పెడుతున్నారనే ప్రతీ విషయాన్ని అడిగి తెలుసుకునే వాడట. అలా ఏ యాంగిల్‌కు ఏ షాట్‌కు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలో తెలిసిన ఏకైక నటుడు చిరంజీవి అంటూ చోటా చెబుతూఉంటాడు.

కెమెరామెన్‌గా తన పనితనం తెలిసిన చిరు.. ఓ సారి ఇంటికి పిలిచాడట. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ట్ అవుతుంది.. దానికి నువ్వే కెమెరామెన్ అని చోటాతో చిరు అన్నాడట. నేను చేయను అంటూ మొహం మీదే చెప్పేశాడట చోటా. ఎందుకురా అని అంటే.. చేస్తే మీకు చేస్తాను గానీ మీ తమ్ముడికి చేయను.. ముందు మీతోనే పని చేస్తాను అని నేరుగానే అనేశాడట. అయితే అప్పటికి మెగాస్టార్ రేంజ్ ‌ఉన్న చిరంజీవి.. కెమెరామెన్‌గా అప్పుడప్పుడు అడుగులు వేస్తున్న చోటాకు అవకాశం అంటే మామూలు విషయం కాదని చిరంజీవి అన్నాడట. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ చిరంజీవి కాంబినేషన్‌లో రావాల్సిన సినిమాకు చోటాను కెమెరామెన్‌గా ఫిక్స్ చేశారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. దాని తరువాత చూడాలని వుంది, బావగారూ బాగున్నారా ఇలా ఈ కాంబోలో సూపర్ హిట్స్ వచ్చాయి.

Advertisement
WhatsApp Group Join Now

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది