Allari Naresh : నవ్వించే అల్లరి నరేష్ జీవితంలో… విషాదం నింపే లవ్ బ్రేకప్ ఉందని మీకు తెలుసా..!
Allari Naresh : అల్లరి నరేష్ తన కెరీర్ ప్రారంభం నుంచి కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరోగా చేస్తూనే… సపోర్టింగ్ యాక్టర్ గా మంచి పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. గమ్యం, శంభో శివ శంభో, మహర్షీ సినిమాల్లో నటించిన నరేష్ కు పలు అవార్డులు సొంతం కావడం విశేషం.పెళ్లి అనంతరం ఫ్యామిలీ లైఫ్ తో బిజీగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్న అల్లరి నరేష్… ఒకప్పుడు లవ్ ఫెల్యూయర్ అంట. ఓ న్యూస్ ఛానల్ లో పని చేసే న్యూస్ రీడర్ తో ప్రేమాయణం కొనసాగించిన నరేష్…. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల ఆమెతో బ్రేకప్ అయిందని టాక్.
అప్పట్లో ఇదే విషయమై నరేష్ ను మీడియా వాళ్ళు కూడా పలు మార్లు ప్రశ్నించారు. దీనిపై నరేష్ కూడా షాకింగ్ గా సమాధానం ఇచ్చారు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి సాక్షి ఛానల్ న్యూస్ రీడర్ అంత అందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు నరేష్ అప్పట్లో ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.అల్లరి చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి నరేష్ ఎంట్రీ ఇచ్చారు. అలా తన కుమారుడిని హీరోగా పెట్టి ఈవీవి ఎన్నో కామెడీ చిత్రాలను తెరకెక్కించారు.

cine hero Allari Naresh breakup story
Allari Naresh : న్యూస్ రీడర్ తో లవ్, బ్రేకప్:
అందులో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలవడంతో పాటు ఆయన కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చాయి. అయితే గత కొన్నేళ్లుగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న అల్లరి నరేష్.. చాలా కాలం తర్వాత ఇటీవల నాంది సినిమాతో మంచి హిట్ కైవసం చేసుకున్నారు. కామెడీ మాత్రమే కాదు మంచి పాత్ర పడితే నటనలో విశ్వరూపం చూపించగలనని మరోసారి రుజువు చేశారు. నాంది హిట్ అనంతరం కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న నరేష్.. కంటెంట్ ఉన్న కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ ఆలోచించి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం నరేష్… సభకు సమస్కారం అనే మూవీలో నటిస్తున్నారు. నరేష్ కెరీర్లో 58వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం… సైటిరికల్ పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతోందని సమాచారం.