Khushi Movie : ఖుషి సక్సెస్ మీట్ లో సినిమాటోగ్రాఫర్ మురళి సంచలన వ్యాఖ్యలు..!!

Authored By Breaking News | The Telugu News | Published on: September 5, 2023, 5:00 pm

Khushi Movie : సెప్టెంబర్ మొదటి తారీకు ఖుషి సినిమా విడుదల కావడం తెలిసిందే. విజయ్ దేవరకొండ, సమంతా కలసి నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో సోమవారం విశాఖపట్నంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ మురళి సంచలన స్పీచ్ ఇచ్చారు. సినిమాలో అందమైన లోకేషన్ లతో పాటు హీరో హీరోయిన్స్… అద్భుతంగా చూపించడం జరిగింది. ఈ క్రమంలో ఖుషి సినిమా చూస్తున్నప్పుడు రజనీకాంత్ కావలి సినిమాకి వచ్చిన రెస్పాన్స్ మాస్ ఆడియన్స్ నుండి వచ్చినట్లు ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా హీరో విజయ్ దేవరకొండ తో తన జర్నీ ఎప్పటినుంచో అని అన్నారు.

ఇదే సమయంలో నిర్మాతలకు ఇంకా డైరెక్టర్ శివ నిర్వాణ కి.. తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. థియేటర్ లో ఖుషి సినిమా చూసిన సమయంలో ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేయటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ విజయం విజయ్ దేవరకొండ కి ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్రమంలో కాశ్మీర్ నుండి కేరళ వరకు అద్భుతంగా లొకేషన్స్ చూపించారు.

cinematographer muralis comments at khushi Movie success-meet

cinematographer muralis comments at khushi Movie success-meet

సినిమాలో ఖుషి షూటింగ్ చేస్తున్న సమయంలో ఫేవరెట్ మూమెంట్ ఏంటి అని యాంకర్స్ ప్రశ్నించారు. దీనికి మురళి సమాధానం ఇస్తూ అంతకుముందు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లో తప్ప ఎప్పుడూ కూడా కాశ్మీర్ చూడలేదు. డైరెక్టర్ తమ సినిమాలో కాశ్మీర్ అందంపై అద్భుతమైన రైటింగ్ రాయడం జరిగింది. కాశ్మీర్ అందం చాలా అద్భుతంగా ఉందని మురళి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp