Mokshagna : బాల‌కృష్ణ త‌న‌యుడి సినిమా మొద‌లు కాబోతుంది.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mokshagna : బాల‌కృష్ణ త‌న‌యుడి సినిమా మొద‌లు కాబోతుంది.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే.!

 Authored By sandeep | The Telugu News | Updated on :31 May 2022,9:30 pm

Mokshagna: గ‌త కొద్ది రోజులుగా బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ మూవీ లాంచింగ్‌కి సంబంధించి జోరుగా ప్ర‌చారాలు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అప్పుడు …ఇప్పుడు అంటున్నా ఇప్పటికీ ఓ క్లారిటీ రాకపోవడం కాస్త నిరాశ నింపుతోంది. ఈ క్రమంలో బాలయ్య తన వారసుడు ఎంట్రీ కోసం డైరక్టర్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. బాలయ్య 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని భావించిన ప్రేక్షకులకు ఎదురుచూపులే మిగిలాయి. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని ప్రకటించి అభిమానులకు కాస్త బూస్టింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. ప్రస్తుతం ఆ వైపుగా అడుగులేస్తున్నట్లు సమాచారం.

Mokshagna : మోక్ష‌జ్ఞ ఎంట్రీపై క్లారిటీ..!

ఇక ఆ మధ్యన మోక్షజ్ఞ లాంచ్‌ప్యాడ్ ప్రాజెక్ట్‌కి పూరి జగన్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే పూరీ ఇతర కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉండటంతో అది కష్టమైపోయింది. అలాగే బాలయ్య బాబు హీరోగా వచ్చి అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాధించిన ‘ఆదిత్య 369’ సీక్వల్‌తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని అంతా భావించారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ కూడా ఫినిష్ అయ్యింది. అదీ మెటీరియలైజ్ కాలేదు. మరో ప్రక్క మోక్షజ్ఞ సినీ ఎంట్రీ బాధ్యతను బోయపాటి తీసుకున్నారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది.

clarity on mokshagna Tollywood entry

clarity on mokshagna Tollywood entry

తనకు హాట్రిక్ హిట్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్‌తోనే మోక్షజ్ఞ ఎంట్రీ జరగాలని సెంటిమెంటల్‌గా బాలయ్య ఫిక్సయ్యారట. అది అదీ నిజం కాలేదు. దానికి తోడు మోక్ష కూడా తన షేప్‌ను కూడా కోల్పోయాడు. ఇప్పుడు ఫుల్ షేప్ కు వచ్చారట. దీంతో త్వరలోనే అతని చిత్రం ప్రారంభం అవుతుందని క్లారిటీ వచ్చేసింది. మరి ఎవరు ఆ డైరక్టర్ అంటే…అనీల్ రావిపూడి అని తెలుస్తోంది. అనీల్ రావిపూడి అయితే హీరోని సేఫ్ గా లాంచ్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చి …తన హీరోతో కామెడీ నుండి ఫైట్స్ , రొమాన్స్ అన్నీ చేయిస్తూ ఉంటారు. కాబట్టి, మోక్షజ్ఞ ప్రతిభను తెలుగు ప్రేక్షకులు బాగా గుర్తించాలంటే ఆ దర్శకుడే ఫెరఫెక్ట్ అని డిసైడ్ అయ్యారట. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది