Avinash : ఏం టైంలో కంపోజ్ చేశారో గానీ.. శేఖర్ మాస్టర్ పరువుతీసిన అవినాష్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Avinash : ఏం టైంలో కంపోజ్ చేశారో గానీ.. శేఖర్ మాస్టర్ పరువుతీసిన అవినాష్

 Authored By bkalyan | The Telugu News | Updated on :7 February 2022,7:30 pm

Avinash : బుల్లితెరపై శేఖర్ మాస్టర్‌కు ఉన్న క్రేజ్, వెండితెరపై కొరియోగ్రఫర్‌గా ఉన్న డిమాండ్ వేరే లెవెల్. ఇక సోషల్ మీడియా, యూట్యూబ్‌లోనూ శేఖర్ మాస్టర్ హల్చల్ చేస్తుంటాడు. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే స్టెప్పులు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఐకానిక్ స్టెప్పులుగా మారిపోతుంటాయి. అలా ఏక్ బార్ ఏక్ బార్ అనే స్టెప్పులు ఓరేంజ్‌లో వైరల్ అయ్యాయి.

వినయ విధేయ రామ సినిమా కోసం రామ్ చరణ్‌తో శేఖర్ మాస్టర్ వేయించిన ఆ స్టెప్పులు ఇప్పటికీ ట్రెండ్అవుతూనే ఉంటాయి. అయితే వాటి మీద తాజాగా అవినాష్ కౌంటర్లు వేశాడు. కామెడీ స్టార్స్ ధమాకాలో శేఖర్ మాస్టర్‌ను రోస్ట్ చేసి పడేశారు. శేఖర్ మాస్టర్‌గా యష్ మాస్టర్ నటించాడు. ఇక అవినాష్ లేడీ గెటప్పుతో దుమ్ములేపేశాడు.

Comedian Avinash On Sekhar Master Steps in Comedy Stars Dhamaka

Comedian Avinash On Sekhar Master Steps in Comedy Stars Dhamaka

Avinash : శేఖర్ మాస్టర్ స్టెప్పులు.

శేఖర్ మాస్టర్ అభిమానిగా అవినాష్ నటించాడు. ఏక్ బార్ ఏక్ బార్ అంటూ డ్యాన్స్ మూమెంట్‌ను అవినాష్ వేశాడు. ఫ్లోర్ మూమెంట్ వేస్తూ.. ఏ టైంలో ఈ స్టెప్ కంపోజ్చ చేశారో గానీ అని అవినాష్ అంటాడు. ఏం టైంలో కంపోజ్ ఏంట్రా అని శేఖర్ మాస్టర్ పగలబడి నవ్వేస్తుంటాడు. మొత్తానికి శేఖర్ మాస్టర్ స్టెప్పుల మీద ఎప్పుడూ ఏదో ఒక రకమైన సెటైర్లు వేస్తుంటారు.

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది