Naresh : కమెడియన్ నరేష్‌ను ఉతికి ఆరేసింది!.. చితక్కొట్టేసిన సీరియల్ నటి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Naresh : కమెడియన్ నరేష్‌ను ఉతికి ఆరేసింది!.. చితక్కొట్టేసిన సీరియల్ నటి

Naresh : బుల్లితెరపై కమెడియన్ నరేష్ చేసే కామెడీ ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసిందే. ఆకారం చిన్నదే అయితే కామెడీ మాత్రం పెద్ద స్థాయిలోనే ఉంటుంది. ఒకప్పుడు నరేష్, నెమలిరాజు మధ్య కోల్డ్ వార్ జరిగేది. కానీ నెమలి రాజు జీ తెలుగుకు షిఫ్ట్ అయ్యాడు. అలా నరేష్‌కు ఎదురులేకుండా పోయింది. ఇప్పుడు నరేష్ జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ దుమ్ములేపుతున్నాడు. నరేష్ తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను కూడా నిద్రలేపుతున్నాడు. ఈ మధ్య షబీనాతో నరేష్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :7 December 2021,8:20 pm

Naresh : బుల్లితెరపై కమెడియన్ నరేష్ చేసే కామెడీ ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసిందే. ఆకారం చిన్నదే అయితే కామెడీ మాత్రం పెద్ద స్థాయిలోనే ఉంటుంది. ఒకప్పుడు నరేష్, నెమలిరాజు మధ్య కోల్డ్ వార్ జరిగేది. కానీ నెమలి రాజు జీ తెలుగుకు షిఫ్ట్ అయ్యాడు. అలా నరేష్‌కు ఎదురులేకుండా పోయింది. ఇప్పుడు నరేష్ జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ దుమ్ములేపుతున్నాడు.

నరేష్ తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను కూడా నిద్రలేపుతున్నాడు. ఈ మధ్య షబీనాతో నరేష్ రొమాన్స్ చేసేందుకు బాగానే ప్రయత్నిస్తున్నాడు. చూసేందుకు చిన్నగానే ఉన్నా.. నరేష్ వయసు దాదాపు 22 ఏళ్లు ఉంటుంది. అలా షబీనాతో నరేష్ చేసే రొమాన్స్ మీద రోజా కూడా సెటైర్లు వేస్తుంటుంది. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో నరేష్‌కు దిమ్మతిరిగిపోయింది.

Comedian Naresh In Sridevi Drama Company

Comedian Naresh In Sridevi Drama Company

Naresh : నరేష్‌ను చితకబాదిన నటి..

సీరియల్ ఆర్టిస్ట్ ఒకరు గెస్టుగా వచ్చింది. ఆమె నరేష్‌ను ఉతికి ఆరేసింది. దబాదబా వాయించేసింది. చెంప మీద కొట్టేసింది. ఒక్కసారిగా జడివాన కురిసినట్టుగా దెబ్బల వర్షం కురిపించింది. దీంతో ఏం జరిగిందో తెలియక నరేష్ షాక్ అయ్యాడు. మళ్లీ ఒకసారి కొట్టేందుకు వెళ్లగా.. నరేష్ స్టేజ్ దిగి పారిపోయే ప్రయత్నం చేశాడు. మొత్తానికి నరేష్‌ను అందరూ ఇలా వాడేసుకుంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది