
Comedian Vidyullekha Raman And Her Husband In Zee Telugu Bonalu Jathara
Vidyullekha Raman : లేడీ కెమెడియన్లు ఉండటమే చాలా అరుదు. అలాంటిది తమిళం నుంచి తెలుగులో మంచి కమెడియన్‌గా పేరు సంపాదించుకుంది విద్యుల్లేఖ రామన్. హీరోయిన్ ఫ్రెండ్స్‌గా, సైడ్ ఆర్టిస్ట్‌గా నవ్వులు పూయిస్తుంటుంది విద్యుల్లేఖ. అలాంటి కమెడియన్‌కు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ మధ్య ఆమెకు చాలానే ఆఫర్లు వచ్చాయి. అయితే మధ్యలో ఆమె హీరోయిన్‌గా మారేందుకు ప్రయత్నించింది. ఇక తన లావు తనకు కలిసి వచ్చింది. అదే లావు తనకు అవకాశాలను రాకుండా చేసింది. ఎక్కువ లావు అవుతోందన్న కారణంతో ఆఫర్లు తగ్గిపోయాయట. అయితే ఆ మధ్య విద్యుల్లేఖ ఎంతో కష్టపడి, ఎన్నో వ్యాయామాలు చేసి కాస్త తగ్గింది.
ఆమె బరువు తగ్గిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక విద్యుల్లేఖ హీరోయిన్‌గానూ ప్రయత్నాలు చేసింది. అయితే విద్యుల్లేఖ రామన్ ప్రేమ, పెళ్లి విషయాలు కూడా నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అయ్యాయి. ప్రేమ వివాహాం చేసుకున్న విద్యుల్లేఖ తాజాగా తన భర్తను స్టేజ్ మీదకు తీసుకొచ్చింది. అందరికీ పరిచయం చేసింది. స్టేజ్ మీదకు తీసుకొచ్చిన విద్యుల్లేఖ రామన్ తన ప్రేమ, పెళ్లి గురించి చెప్పింది. ఇక ఆమె భర్త మాత్రం సెటైర్లతో ఆడుకున్నాడు. పెళ్లి తరువాత లైఫ్ ఎలా ఉంది? అంటూ శ్రీముఖి అడిగింది. అదంతా అవుట్ ఆఫ్ సిలబస్ అంటూ అసలు విషయం చెప్పుకుండా దాటేశాడు.
Comedian Vidyullekha Raman And Her Husband In Zee Telugu Bonalu Jathara
ఇక విద్యుల్లేఖ రామన్ అయితే ప్రేమ గురించి చెప్పింది. 2019లో తమఇద్దరి పరిచయం జరిగిందని, కొన్నాళ్లు ఎలా ఉంటామో కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని చూశా..తరువాత పెళ్లి చేసుకున్నామని విద్యుల్లేఖ చెప్పింది. మరి కెమిస్ట్రీ ఎలా ఉందని శ్రీముఖి కొంటెగా అడిగితే.. విద్యుల్లేఖ తన స్టైల్లో కామెడీ చేస్తూ తమ మధ్య ఉన్న బంధం గురించి చెప్పేసింది. అలా ఈ ప్రోమోలో విద్యుల్లేఖ తన భర్తను మొదటి సారిగా తెర ముందుకు తీసుకొచ్చినట్టు అయింది. అంతే కాకుండా దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరో సైతం ఈ ఈవెంట్‌కు వచ్చిన తన సీతారామం సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.