Ram Charan : మెగా హీరో రామ్ చరణ్ వివాదాలకు కాస్త దూరంగానే ఉంటారు. తన తండ్రి మాదిరిగానే తాను కూడా పెద్దగా వివాదాల జోలికి వెళ్లడు. కాని కొందరు మాత్రం ఏదో విషయంలో వివాదం సృష్టిస్తుంటారు. తాజాగా రామ్ చరణ్ తో పాటు ఆయన చిత్ర యూనిట్‌పై బీజేపీ కార్పోరేటర్ మండిపడింది. చరణ్ 15వ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. హైదరాబాద్ సరూర్నగర్ లోని వీఎం హోమ్ అనే ఒక అనాధాశ్రయములో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుండగా అక్కడి స్థానిక బిజెపి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ గౌడ్ అడ్డుకున్నారు.
విద్యార్థుల తరగతులు జరుగుతున్న సమయంలో షూటింగ్ కు అనుమతి ఎలా ఇస్తారు అంటూ ఆమె షూటింగ్ ని అడ్డుకున్నట్టు సమాచారం. తెలంగాణ విద్యాశాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే అయిన సబితా ఇంద్రారెడ్డి తమ స్వలాభం కోసమే విద్యార్థులు జీవితాన్ని పణంగా పెట్టి సినిమా షూటింగ్ కు అనుమతి ఇచ్చారంటూ కార్పొరేటర్ శ్రీవాణి ఆరోపించారు. కేవలం శంకర్ – రామ్ చరణ్ సినిమా కావడంతో, అప్పటికప్పుడు స్కూల్‌ని బాగు చేసేందుకు నిధులు విడుదల చేశారనీ, మరోపక్క.. విద్యార్థులు క్లాసులకు హాజరైన సమయంలో షూటింగ్ చేయడం వల్ల, పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తుందనీ ఆరోపిస్తున్నారు బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి.
స్కూల్‌లో షూటింగ్ చేయడానికి వీల్లేదంటూ శ్రీవాణి ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు రామ్ చరణ్ పాత్ర శంకర్ సినిమాలో ఎలా ఉంటున్నదానిపై ఇంట్రస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో చరణ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడని.. ఓ పాత్రలోని చరణ్‌కు కోపం ఎక్కువగా ఉంటుందని.. అతడు చేసే మ్యానరిజం చూడటానికి చాలా బాగుంటుందని తెలుస్తోంది. దీంతో పాటు మరొక పాత్రలో చరణ్ పల్లెటూరి నుండి వచ్చిన రాజకీయ నేతగా మనకు కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని సినిమా టీం భావిస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.