Ram Charan : రామ్ చ‌ర‌ణ్‌.. నీకు బుద్ధి ఉందా అని తిట్టిపోసిన మ‌హిళ‌.. ఆమె ఎవ‌రో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: July 27, 2022, 9:30 pm

Ram Charan : మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ వివాదాల‌కు కాస్త దూరంగానే ఉంటారు. త‌న తండ్రి మాదిరిగానే తాను కూడా పెద్ద‌గా వివాదాల జోలికి వెళ్ల‌డు. కాని కొంద‌రు మాత్రం ఏదో విష‌యంలో వివాదం సృష్టిస్తుంటారు. తాజాగా రామ్ చ‌ర‌ణ్ తో పాటు ఆయ‌న చిత్ర యూనిట్‌పై బీజేపీ కార్పోరేట‌ర్ మండిప‌డింది. చ‌రణ్ 15వ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. హైదరాబాద్ సరూర్నగర్ లోని వీఎం హోమ్ అనే ఒక అనాధాశ్రయములో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుండగా అక్కడి స్థానిక బిజెపి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ గౌడ్ అడ్డుకున్నారు.

విద్యార్థుల తరగతులు జరుగుతున్న సమయంలో షూటింగ్ కు అనుమతి ఎలా ఇస్తారు అంటూ ఆమె షూటింగ్ ని అడ్డుకున్నట్టు సమాచారం. తెలంగాణ విద్యాశాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే అయిన సబితా ఇంద్రారెడ్డి తమ స్వలాభం కోసమే విద్యార్థులు జీవితాన్ని పణంగా పెట్టి సినిమా షూటింగ్ కు అనుమతి ఇచ్చారంటూ కార్పొరేటర్ శ్రీవాణి ఆరోపించారు. కేవలం శంకర్ – రామ్ చరణ్ సినిమా కావడంతో, అప్పటికప్పుడు స్కూల్‌ని బాగు చేసేందుకు నిధులు విడుదల చేశారనీ, మరోపక్క.. విద్యార్థులు క్లాసులకు హాజరైన సమయంలో షూటింగ్ చేయడం వల్ల, పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తుందనీ ఆరోపిస్తున్నారు బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి.

corporator fire on ram charan

corporator fire on ram charan

Ram Charan : చ‌ర‌ణ్‌కి వార్నింగ్..

స్కూల్‌లో షూటింగ్ చేయడానికి వీల్లేదంటూ శ్రీవాణి ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు రామ్ చరణ్ పాత్ర శంకర్ సినిమాలో ఎలా ఉంటున్నదానిపై ఇంట్రస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో చరణ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడని.. ఓ పాత్రలోని చరణ్‌కు కోపం ఎక్కువగా ఉంటుందని.. అతడు చేసే మ్యానరిజం చూడటానికి చాలా బాగుంటుందని తెలుస్తోంది. దీంతో పాటు మరొక పాత్రలో చరణ్ పల్లెటూరి నుండి వచ్చిన రాజకీయ నేతగా మనకు కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని సినిమా టీం భావిస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp