Navdeep : ఏంటి న‌వదీప్ రెమ్యున‌రేషన్ ఇంకా అంత‌ ట‌చ్ కాలే.. ఈ సినిమా త‌ర్వాత అంటు స్ట‌న్నింగ్ కామెంట్స్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Navdeep : ఏంటి న‌వదీప్ రెమ్యున‌రేషన్ ఇంకా అంత‌ ట‌చ్ కాలే.. ఈ సినిమా త‌ర్వాత అంటు స్ట‌న్నింగ్ కామెంట్స్

Navdeep  : ప్రస్తుతం టాలీవుడ్‏లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‏లలో ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది ప్ర‌భాస్, న‌వదీప్ పేర్లు. ప్ర‌భాస్ ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునేలా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న బాట‌లోనే న‌వ‌దీప్ వెళుతున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. జై సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు నవ‌దీప్‌. ఒక‌వైపు హీరోగా న‌టిస్తూనే మ‌రోవైపు స్నేహితుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‏గా.. విలన్ పాత్రలలో త‌న‌దైన న‌ట‌న‌తో అల‌రించారు. అయితే ఇప్పుడు […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 April 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Navdeep : ఏంటి న‌వదీప్ రెమ్యున‌రేషన్ ఇంకా అంత‌ ట‌చ్ కాలే.. ఈ సినిమా త‌ర్వాత అంటు స్ట‌న్నింగ్ కామెంట్స్

Navdeep  : ప్రస్తుతం టాలీవుడ్‏లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‏లలో ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది ప్ర‌భాస్, న‌వదీప్ పేర్లు. ప్ర‌భాస్ ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునేలా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న బాట‌లోనే న‌వ‌దీప్ వెళుతున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. జై సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు నవ‌దీప్‌. ఒక‌వైపు హీరోగా న‌టిస్తూనే మ‌రోవైపు స్నేహితుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‏గా.. విలన్ పాత్రలలో త‌న‌దైన న‌ట‌న‌తో అల‌రించారు. అయితే ఇప్పుడు న‌వ‌దీప్‌కి పెద్ద‌గా హిట్స్ ద‌క్క‌డం లేదు. ఈ క్ర‌మంలో వెండితెర‌పై న‌టిస్తూనే ఓటీటీలోను స‌త్తా చాటుతున్నాడు. అలానే షోస్‌లో కూడా సంద‌డి చేస్తూ అల‌రిస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నా.. పెళ్లి ఊసే ఎత్తడం లేదు న‌వ‌దీప్‌.

Navdeep  రెమ్యున‌రేష‌న్‌పై నవ‌దీప్ కామెంట్స్

ఆయ‌న‌ని ప‌లు సంద‌ర్భాల‌లో నెటిజ‌న్స్ ట్రోల్ చేయ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. గడ్డం తెల్లబడుతుందన్నా… పెళ్లి చేసుకో అంటూ నెట్టింట్లో సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ కామెంట్స్ చూసిన నవదీప్.. వ‌ద్దురా సోద‌రా అంటున్నాడు. నవదీప్ కొంత విరామం తర్వాత హీరోగా, న‌వ‌దీప్ 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు కాగా, ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌‌తో క‌లిసి.. టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ నిర్మిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుద‌ల చేయబోతున్నట్లుగా కొద్ది రోజుల క్రితం మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌మోష‌న‌ల్ స్పీడ్ పెంచారు.

Navdeep ఏంటి న‌వదీప్ రెమ్యున‌రేషన్ ఇంకా అంత‌ ట‌చ్ కాలే ఈ సినిమా త‌ర్వాత అంటు స్ట‌న్నింగ్ కామెంట్స్

Navdeep : ఏంటి న‌వదీప్ రెమ్యున‌రేషన్ ఇంకా అంత‌ ట‌చ్ కాలే.. ఈ సినిమా త‌ర్వాత అంటు స్ట‌న్నింగ్ కామెంట్స్

అయితే తాజాగా త‌న రెమ్యున‌రేష‌న్ గురించి మాట్లాడిన న‌వ‌దీప్ హీరోగా సినిమాలు చేసిన‌ప్పుడు ఒక రెమ్యున‌రేష‌న్ వ‌స్తుంది. పెద్ద సినిమాలలో స‌పోర్టింగ్ రోల్ చేసిన‌ప్పుడు ఒక రెమ్యున‌రేష‌న్ ఇస్తారు. సాటిస్ఫాక్ష‌న్ అనేది ఉంటుంది. సినిమాకి నేను అవ‌స‌ర‌మా, నా పాత్ర దానికి సూట్ అవుతుందా ఇలా వంద ఫ్యాక్ట‌ర్స్ అనేవి తప్ప‌కుండా ఉంటాయి.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కోటి రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ట‌చ్ చేయలేదు. ఫ్యూచ‌ర్‌లో చేస్తానేమో అంటూ స్ట‌న్నింగ్ కామెంట్స్ చేశారు న‌వదీప్.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది