Jr NTR : మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్‌పై అత్త పురందేశ్వరి ఎమోషనల్ కామెంట్స్
Jr NTR : సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన పేరు మీద 100 రూపాయల నాణేన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను అందరినీ ఆహ్వానించింది కేంద్రం. కానీ.. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతిని మాత్రం కేంద్రం ఆహ్వానించలేదు. ఆమెను పిలవకపోవడంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి భర్త వెంకటేశ్వరరావుకి కూడా ఆహ్వానం అందింది.
తనను పక్కన పెట్టడంపై లక్ష్మీ పార్వతి మాత్రం ఫైర్ అయింది. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో పురందేశ్వరి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఎన్టీఆర్ ఒక తరానికే చెందిన నేత కాదని.. అన్ని తరాలకు చెందిన నేత అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. స్మారకనాణెం విడుదల చేయడం ఎన్టీఆర్ కి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మహిళల కోసం ఎన్టీఆర్ ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్టు పురందేశ్వరి తెలిపారు.మహిళలకు ఆస్తిలో హక్కు ఉండాలని చెప్పారన్నారు. తిరుపతిలో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే.. పురందేశ్వరి కామెంట్స్ పై విజయసాయిరెడ్డి స్పందించారు. ఒకసారి మాట్లాడేముందు ఆలోచించమ్మా అంటూ పాత విషయాలు అన్నీ ప్రస్తావించారు.
Jr NTR : మహిళలకు ఆస్తి హక్కు ఉండాలని చెప్పిన ఎన్టీఆర్
వాటాలు తేల్చుకోలేక మద్రాసులో ఎన్టీఆర్ ఇల్లు బాడుకి ఇచ్చారు. అబిడ్స్ లో ఆయన ఇల్లు అమ్ముకున్నారు. బంజారాహిల్స్ లో ఉన్న ఇల్లును ఆయన మరణించిన తర్వాత కూలగొట్టి అపార్ట్ మెంట్స్ లేపి రెంట్స్ కి ఇచ్చారు. దానికి ఎదురుగా ఉన్న ఇంట్లో మ్యూజియం పెట్టాలనుకున్నారు. కానీ.. ఆయన ఆశయాలను నట్టేట ముంచారు. తండ్రిపై ప్రేమ గుండె లోతుల్లో నుంచి రావాలి కానీ.. ఏదో పేపర్లలో రాత కోసం, టీవీల్లో చూడటం కోసం కాదు చెల్లెమ్మా. సమాధి కూడా లేకుండా చేసి ఆయనకు స్మారక చిహ్నం కూడా లేకుండా చేశారు అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.